చైతూని సమంత ఎక్కడ ముద్దు పెట్టుకొన్నదో తెలుసా?.. గాఢంగా బంధించి.. పబ్‌లో రచ్చరచ్చ
పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత అక్కినేని వ్యక్తిగతంగానూ, ప్రొఫెషనల్ గానూ మంచి జోష్ మీద ఉన్నారు. అటు సినిమాలను, పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నారు. అలాగే ఫీల్‌గుడ్ సినిమాలతో బాక్సాఫీస్‌ను కేక పెట్టిస్తున్నారు. ఇలా ఏడాది అంతా బిజీగా గడిపిన చైతూ, సామ్ ప్రస్తుతం బ్రేక్ తీసుకొని విహార యాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా సమంత ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.
పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

స్పైయిన్‌లోని ఐబిజాలో విహారయాత్ర
సమంత, చైతన్య వివాహం జరిగి ఏడాది పూర్తి కావోస్తున్నది. వారి వివాహం గతేడాది గోవాలో అక్టోబర్ మొదటివారంలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారు ప్రస్తుతం స్పైయిన్‌లోని ఐబిజాలో విహారయాత్ర చేస్తున్నారు. వారి వెంట అమల, అఖిల్ కూడా ఉన్నట్టు తెలుస్తున్నది.

సమంత, చైతన్య, అఖిల్ పార్టీ జోష్
స్పెయిన్ వెకేషన్‌లో భాగంగా సమంత, చైతన్య, అఖిల్ ఓ పబ్‌లో ఎంజాయ్ చేసినట్టు స్పష్టమైంది. ఈ సందర్భంగా నాగచైతన్యను సమంత ముద్దు పెట్టుకొంటున్న దృశ్యాన్ని ఎవరో కెమెరాలో బంధించారు. ఆ ఫొటోను సమంత ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నీవు నా లైఫ్‌లో కాంతి కిరణం అని కామెంట్ చేసింది.

అఖిల్, నాగచైతన్య ఫుల్ ఎంజాయ్
ఇక పబ్‌లో అఖిల్, నాగచైతన్య ఫుల్ ఎంజాయ్ చేస్తున్న మూడ్‌లో కనిపించారు. జిగేల్‌మని అనిపించే కాంతి, లైట్ల వెలుతురులో చేతులెత్తి పార్టీలో మునిగి తేలుతున్నట్టు స్పష్టమైంది. దేవదాస్ సినిమా ప్రమోషన్ కోసం నాగార్జున హైదరాబాద్‌లో ఉండిపోయారు. ఈ పార్టీలో నాగ్ కూడా ఉండి ఉంటే ఇంకా దిమ్మతిరిగిపోయేది అనే మాట వినిపిస్తున్నది.

ఇన్స్‌టాగ్రామ్‌లో కామెంట్
కాగా ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోపై నెటిజన్లు ట్రోల్ చేశారు. ‘ఇలాంటి ఫొటోలు పెడితే నాలాంటి వాళ్లు ఏమైపోవాలి', ఇద్దరు సూపర్ జోడి, చైతన్య లక్కీ పర్సన్, ‘అక్కినేని ఫ్యామిలీలో మరో సభ్యుడి రాక కోసం ఎదురుచూస్తున్నాను' అని కామెంట్లు విసిరారు.


Click it and Unblock the Notifications











