నా బిడ్డే నాకు ప్రపంచం... నాగచైతన్య గుడ్ ఫాదర్.. సమంత ప్రెగ్నెన్సీ గుట్టువిప్పి..
Recommended Video
అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న సమంత అక్కినేని తన తాజా చిత్రం ఓ బేబీ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. తన సినిమాను ప్రేక్షకులకు చేరవేసే ప్రయత్నం చేస్తుండగా.. ఆమె గర్భవతి అనే రూమర్లు చుట్టుముట్టాయి. వాటికి సమాధానం ఇస్తూ.. తన ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చారు. రూమర్లకు ధీటుగా చెప్పే ప్రయత్నంలో తన వైఖరి ప్రదర్శించారు. తాజాగా మరోసారి తన ప్రెగ్నెన్సీ విషయంపై ఏమన్నారంటే..

నాకు కనుక పిల్లలు పుడితే
నాకు పిల్లలు పుడితే.. వారికి నేనే ప్రపంచంగా మారుతాను. ఎందుకంటే నా బాల్యం అంతగా ప్రేమకు నోచుకోలేదు. అందుకే మాతృమూర్తులంటే నాకు అత్యంత గౌరవం. ఎవరికైతే చిన్నతనంలో ప్రేమను పొందలేకపోతారు.. వారు తమ పిల్లలకు సర్వం అందించే ప్రయత్నం చేస్తారు. నేను కూడా అదే దారిని ఎంచుకొంటాను అని సమంత అక్కినేని చెప్పారు.

నా బిడ్డే నాకు సర్వస్వం
నాకు సంతానం కలిగితే కొన్ని సంవత్సరాలు నేను ఎక్కడా కనిపించను. నాకు నా బిడ్డే సర్వస్వం. సినిమాలు, ఇంకేమీ పట్టించుకోను. నా బిడ్డకు నేను అన్నీ అవుతాను. నా ప్రపంచంలోకి నా బిడ్డను స్వాగతించి అశేషమైన ప్రేమను అందించేందుకు ప్రయత్నిస్తాను. నా బాల్యంలో నేను పొందలేని ప్రేమను నా బిడ్డకు పంచుతాను అని సమంత పేర్కొన్నారు.

నాగచైతన్య గొప్ప తండ్రి అవుతాడని
ఇక నాగ చైతన్య గొప్ప తండ్రి అవుతాడని బలంగా విశ్వసిస్తున్నాను. ఆ విషయంలో నేను 100 శాతం కాన్ఫిడెంట్. ఎవరికీ లేనంత సహనం చైతుకు ఉంది. ప్రస్తుతం మా పెంపుడు కుక్కలకు స్విమ్మింగ్ నేర్పించే బాధ్యతను భుజాన వేసుకొన్నాడు. ఇంట్లో పెంపుడు కుక్కలను ఎంత బాగా చూసుకొంటారో మాటల్లో చెప్పలేను అని సమంత వెల్లడించింది.

ప్రేమలో మునిగి పెళ్లితో బంధం
గత కొద్ది సంవత్సరాల క్రితం ప్రేమలో పడిన సమంత, నాగ చైతన్య 2017లో వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. హిందూ, క్రిస్టియన్ మతాల ప్రకారం పెళ్లి వేడుక బ్రహ్మండంగా జరిగింది. ఇటీవల మజిలీ చిత్రంలో భార్య, భర్తలుగా కలిసి నటించారు. ఇటీవల ఈ దంపతులు పెంపుడు కుక్కను దత్తత తీసుకొని హ్యాష్ అక్కినేని అంటూ పేరు పెట్టారు. ప్రస్తుతం పెంపుడు కుక్కలను బిడ్డల మాదిరిగా చూసుకొంటూ సంతోషంలో మునిగి తేలుతున్నారు.

జూలై 5న ఓ బేబీ రిలీజ్
ఇక కెరీర్ విషయానికి వస్తే.. ఈ ఏడాది సూపర్ డీలక్స్ అనే చిత్రంతో మంచి సక్సెస్‌ను సమంత అందుకొన్నారు. ఇప్పుడు హే బేబీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంతో ఎంత అనుబంధం పెంచుకొన్నారంటే.. ఏకంగా తన ట్విట్టర్ అకౌంట్ పేరు కూడా మార్చేసుకొన్నారు. సమంత అక్కినేని పేరును బేబీ అక్కినేనిగా మార్చుకొన్నారు. ఈ చిత్రం జూలై 5వ తేదీన రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











