సమంతకు ఆ పనుల్లో సాయం చేసేది ఎవరంటే.. ఇంట్రెస్టింగ్ పోస్ట్!
గత నాలుగైదు రోజులుగా సమంత వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఏదో ఒక వ్యవహారంపై కామెంట్ చేయడం, లేదా తనపైనే కామెంట్స్ రావడం, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్స్ జరగడంతో సమంత తెగ వైరల్ అవుతోంది. పూజా హెగ్డే వ్యవహారంతో సమంత సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సమంతకు మద్దతుగా నందినీ రెడ్డి, చిన్మయి రావడం, సోషల్ మీడియాలో ఎంట్రీ కావడం, సమంత ఫ్యాన్స్ చిట్ చాట్ హేటర్స్‌కు కౌంటర్స్ వేయడం, సమంత తన స్కూల్ ప్రోగ్రెస్ కార్డులను, మెమోలను పోస్ట్ చేయడం తెగ వైరల్ అవుతోంది.

పూజా హెగ్డే-సమంత వ్యవహారం..
పూజా హెగ్డే .. ఏ కోశాన కూడా నాకు సమంత అందంగా కనిపించడం లేదు అని పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ స్టోరీ క్షణాల్లో వైరల్ అయింది. కొద్దిసేపటికే తన అకౌంట్ హ్యాక్ అయిందని పూజా హెగ్డే పేర్కొంది. ఇక వీరిద్దరి వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సమంత ఫ్యాన్స్ పూజాను ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు.

భిన్నస్వరాలు..
మొదటగా సమంతకు మద్దతుగా సోషల్ మీడియాలో ట్రెండ్ నడవగా..నందినీ రెడ్డి, చిన్మయి, సమంతలు పూజాపై సెటైర్లు వేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పూజా హెగ్డేకు మద్దతు పెరిగింది. మంచి మనసు ఉండటం కూడా సమస్యే.. అవతలి వారు మన మంచితనాన్ని పిచ్చి తనంగా భావిస్తారని సమంత ఫీల్ అయింది.

సమంత ప్రతిభ..
సమంత స్కూల్, కాలేజ్‌లో కనబర్చిన ప్రతిభ ఏపాటిదో ఫ్యాన్స్ ముందుంచింది. తనకు గణితంలో వందకు వంద మార్కులు రావడం, సమంత తమ పాఠశాలకు ఆస్తి వంటిదని ప్రిన్సిపాల్ కితాబిచ్చిన ప్రొగ్రెస్ కార్డ్‌ను అందరికీ చూపెట్టింది. తాజాగా డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్‌ను కూడా పోస్ట్ చేసింది.
Recommended Video

ఆర్గానిక్ వ్యవసాయం..
సమంత ఆర్గానిక్ ఫామ్ చేస్తోంది. సిటీలో ఆర్గానిక్ ఫామింగ్ కల్చర్ బాగా పెరిగింది. తమ ఇంటి బాల్కనీనే వ్యవసాయ క్షేత్రంగా మార్చుతున్నారు. ఈ క్రమంలో సమంత కూడా వ్యవసాయం చేస్తోంది. ఈ పనులలో తన పెంపుడు కుక్క సాయం చేస్తుందని పేర్కొంది.


Click it and Unblock the Notifications











