twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సేవ చేయడానికి కాదు వచ్చింది.. సమంత స్కెచ్ మామూలుగా లేదు!!

    |

    అక్కినేని కోడలు సమంత కొత్త రంగంలోకి అడుగుపెట్టింది. ఈ లాక్‌డౌన్ సమయాన్ని సమంత ఎంతో చక్కగా వినియోగించుకుంది. ఓ వైపు అర్బన్ వ్యవసాయం, మరోవైపు వంటలు నేర్చుకునే కార్యక్రమం పెట్టుకుంది. వీటికి సంబంధించిన విశేషాలుఎప్పటికప్పుడు ప్రకటిస్తూ అందరిలోనూ ఉత్సాహాన్ని నింపింది. అయితే తన బిడ్డలాంటి ఓ ప్రాజెక్ట్ కోసం ఎంతగా తపన పడిందో, దాని వెనకాల ఉన్న కథ ఏంటో సమంత వివరించిన సంగతి తెలిసిందే.

    ఫ్యాషన్ డిజైన్ రంగంలోకి..

    ఫ్యాషన్ డిజైన్ రంగంలోకి..

    సమంత ఫ్యాషన్ డిజైన్ రంగంలోకి అడుగుపెట్టింది. సాకి వరల్డ్ పేరుతో కొత్త కొత్త బట్టలను, డిజైన్స్‌ను అతి తక్కువ ధరలకే లభించేట్టు చేయబోతోన్నట్టు తెలిపింది. ఈ మేరకు సమంత తన జీవిత లక్ష్యం, ఆశయం, తాను పడిన కష్టాల గురించి చెబుతూ ‘సాకీ' గురించి ఎమోషనల్ పోస్ట్ చేసింది.

    బిడ్డలాంటిది..

    బిడ్డలాంటిది..

    సాకీ గురించి చెబుతూ.. ఇది నా బిడ్డలాంటిది. దీని కోసం ఎన్నో కలలు కన్నాను.. ఫ్యాషన్ పట్ల నాకున్న ప్రేమకు నిదర్శనమే ఇది. నా జీవిత ప్రయాణంలో దీనికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. నా సినిమా కెరీర్ ప్రారంభించకుముందు నుంచే ఫ్యాషన్ ప్రపంచం, మ్యాగజైన్‌లతో ముడిపడి ఉంది అని సమంత తెలిపింది.

    అక్కినేని ఫ్యామిలీ ప్రమోషన్స్..

    అక్కినేని ఫ్యామిలీ ప్రమోషన్స్..

    ఇక సమంత ప్రకటించిన తన సాకీ డిజైనర్స్‌ను సెలెబ్రిటీలందరూ ప్రమోట్ చేశారు. కొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నందుకు కంగ్రాట్స్ తెలిపారు. ముఖ్యంగా అక్కినేని కుటుంబం నుంచి ఆదరణ లభించింది. సుశాంత్, చైతన్య, అఖిల్ వంటి వారు సామ్‌కు కంగ్రాట్స్ తెలిపారు.

    సేవ చేయడానికి కాదు..

    సేవ చేయడానికి కాదు..

    ఇక సాకీ వరల్డ్ గురించి ఓ కొటేషన్ చెబుతూ.. మనం వచ్చింది సేవ చేయడానికి కాదు.. మనకంటూ ప్రత్యేకంగా ఓ గుర్తింపును క్రియేట్ చేసుకోవడానికి, షైన్ అవ్వడానికి అంటూ ఓ మిర్రర్ సెల్ఫీని షేర్ చేసింది. సమంత ప్రస్తుతం ఫ్యామిలీమ్యాన్ 2 వెబ్ సిరీస్ డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది.

    Recommended Video

    Amaram Akhilam Prema Would Be Released On September 18 In Aha
    సాకీ త్వరలోనే లాంచ్..

    సాకీ త్వరలోనే లాంచ్..

    సాకీ ఫ్యాషన్ దుస్తులు త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతోన్నాయి. ఈ దుస్తులు ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉంచేలా, తక్కువ ధరకే వచ్చేలా ఉంటాయని సమంత పేర్కొంది. మొత్తానికి సమంత మాత్రం తన బ్రాండ్‌ను ప్రమోట్ చేసేందుకు శతవిథాల ప్రయత్నం చేస్తోంది. మరి ఈ రంగంలోనూ సామ్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

    English summary
    Samantha Akkineni Promotes Saaki World. You did not come to serve . You came to create and to SHINE.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X