నాగ చైతన్యపై సమంత ఒత్తిడి.. భర్త ముందే ఆయనకు హామీ కూడా ఇచ్చేసింది.!
టాలీవుడ్ స్టార హీరోయిన్ సమంత - నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా గడుపుతున్నారు. అయితే, మధ్య మధ్యలో మాత్రం ఫారెన్ చెక్కేసి హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తుంటారు. అంతేకాదు, వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. దీంతో ఈ జంట తరచూ వార్తల్లోకి ఎక్కుతూ ఉంటోంది. ఇక, తాజాగా సమంత - నాగ చైతన్య గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఇద్దరూ కలిసి హిట్ కొట్టారు
సమంత వరుస విజయాలతో దూసుకుపోతుంటే... చైతూ మాత్రం కొద్దిరోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే తన భార్య సమంతతో కలిసి నటించిన ‘మజిలీ' ద్వారా చైతూ మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి ఇకపై చేసే సినిమాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ అక్కినేని హీరో భావిస్తున్నాడట. ఇందులో భాగంగానే కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

సమంత అలా.. నాగ చైతన్య ఇలా
‘ఓ బేబీ' తర్వాత సమంత ‘96' రీమేక్‌లో మాత్రమే నటిస్తోంది. తర్వాత కొత్తగా ఏ సినిమాకూ సంతకం చేయలేదు. అయితే, నాగ చైతన్య మాత్రం విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘వెంకీ మామ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను బాబీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా విడుదల కాకముందే నాగ చైతన్య.. శేఖర్ కమ్ముల మూవీని ఓకే చేసేశాడు. ఇందులో చైతూ సరసన సాయి పల్లవి నటిస్తోంది.

నాగ చైతన్యను ఒత్తిడి చేస్తున్న సమంత
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓ విషయంలో నాగ చైతన్యను సమంత ఒత్తిడి చేస్తుందట. ‘RX100' దర్శకుడు అజయ్ భూపతి ఇటీవల చైతూకు ఓ కథను వినిపించాడట. ఆ సమయంలో సమంత కూడా దీన్ని విన్నదని తెలిసింది. ఈ కథ చైతూ కంటే సమంతకే బాగా నచ్చిందట. దీంతో ఈ సినిమా చేయాల్సిందేనని తన భర్తపై ఆమె ఒత్తిడి చేస్తుందట. అంతేకాదు, ఈ సినిమా చైతూ చేస్తాడని డైరెక్టర్‌కు హామీ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది.

అది మహాసముద్రమే
అజయ్ భూపతి వినిపించిన కథ ‘మహాసముద్రం' ప్రాజెక్టేనని కూడా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమాను మాస్ మహారాజ రవితేజ చేయనున్నాడని ఎప్పటి నుంచో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. అంతేకాదు, ఈ సినిమాను మల్టీ స్టారర్‌గా తెరకెక్కించనున్నాడని కూడా ప్రచారం జరిగింది. అయితే, ఈ సినిమాను ఆయన చేయడం లేదని సరికొత్త వార్త బయటకు వచ్చింది. ఈ కారణంగానే ఆయన చైతూను సంప్రదించాడని టాక్.

సమంత తల్లి కావాలనుకుంటుందా.?
సమంత త్వరలోనే తల్లి కావాలని అనుకుంటుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందుకే ప్రస్తుతం చేస్తున్న ‘96' రీమేక్ మినహా మరే సినిమానూ ఒప్పుకోలేదని వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఈ జంట ప్రస్తుతం స్పెయిన్‌లో హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











