For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హోస్టింగ్‌కు సమంత గుడ్‌బై: సామ్ జామ్ షో నుంచి ఔట్.. రహస్యాలు లీక్ చేసిన నాగ చైతన్య

  |

  'ఏమాయ చేశావే' అనే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా పరిచయం అయింది గ్లామరస్ బ్యూటీ సమంత. మొదటి సినిమాలోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆమె.. వరుసగా ఆఫర్లు అందుకుంది. ఫలితంగా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన హవాను చూపిస్తూ దూసుకుపోతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే 'సామ్ జామ్'అనే చిట్ చాట్‌ షోతో హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఇప్పుడు దానికి గుడ్‌బై చెప్పేసింది. ఈ క్రమంలోనే ఆమె భర్త నాగ చైతన్య ఎన్నో రహస్యాలు లీక్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

  వరుస విజయాలు.. దానితో బ్రేక్ పడింది

  వరుస విజయాలు.. దానితో బ్రేక్ పడింది

  కొన్నేళ్లుగా సమంత వరుస విజయాలతో దూసుకుపోతోంది. తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలోనూ ఆమె హిట్ల మీద హిట్లు కొడుతోంది. ఇలాంటి సమయంలో గత ఏడాది ఆమె ‘జాను' అనే సినిమా చేసింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96'కు రీమేక్‌గా వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. ఫలితంగా సామ్ విజయాల పరంపరకు బ్రేక్ పడిపోయింది.

  అందులోకి ఎంట్రీ.. అలాంటి పాత్రలో సామ్

  అందులోకి ఎంట్రీ.. అలాంటి పాత్రలో సామ్

  సమంత ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ వరల్డ్‌లోకి అడుగు పెట్టింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్.. ఫిబ్రవరి నుంచి అమేజాన్‌లో స్ట్రీమ్ అవనుంది. ఇందులో సామ్ టెర్రరిస్టుగా కనిపించబోతుందని ప్రచారం జరుగుతోంది. మనోజ్ భాజ్‌పేయ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషిస్తున్న దీనిని తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే తెరకెక్కిస్తున్నారు.

  పాన్ ఇండియా మూవీలో ప్రధాన పాత్రలో

  పాన్ ఇండియా మూవీలో ప్రధాన పాత్రలో

  ‘జాను' తర్వాత సమంత మరో సినిమాను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఆమె కొత్త ప్రాజెక్టుల గురించి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్‌ రూపొందించనున్న ‘శాకుంతలం' అనే పాన్ ఇండియా ప్రాజెక్టులో ఆమె నటిస్తున్నట్లు ప్రకటించారు. గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలమా గుణ ఈ సినిమాను నిర్మించనున్నారు.

  Jaanu Movie Success Meet | Sharwanand | Samantha
  బిగ్ బాస్‌తో మొదలు.. సామ్ జామ్ షో

  బిగ్ బాస్‌తో మొదలు.. సామ్ జామ్ షో

  ఇప్పటి వరకూ హీరోయిన్‌గానే కనిపించిన సమంత.. కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ దసరా స్పెషల్ ఎపిసోడ్‌కు గెస్ట్ హోస్టుగా ఎంట్రీ ఇచ్చింది. మొదటి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అయింది. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఆమెతో ‘సామ్ జామ్' పేరిట టాక్ షోను ప్రారంభించింది. సినీ సెలెబ్రిటీలతో చిట్ చాట్ చేయడం కోసం మొదలెట్టిన ఇది కూడా సక్సెస్‌ఫుల్ గానే సాగుతోంది.

  సందడి చేసిన సమంత.. అదరగొట్టిందిగా

  ‘సామ్ జామ్' షో సమంత తనదైన శైలి హోస్టింగ్‌తో ఆకట్టుకుంటోంది. అల్లరి చేస్తూ.. నవ్వుతూ.. నవ్విస్తూ తెగ సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ షోలోకి హీరోలు మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ.. దర్శకులు నాగ్ అశ్విన్, క్రిష్ జాగర్లమూడి.. హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా ఎంట్రీ ఇచ్చారు. వీరితో పాటు సైనా దంపతులు వచ్చారు.

  షో నుంచి ఔట్.. నాగ చైతన్య లీక్ చేశాడు

  షో నుంచి ఔట్.. నాగ చైతన్య లీక్ చేశాడు

  సక్సెస్‌ఫుల్‌గా సాగుతోన్న ‘సామ్ జామ్' షో మొదటి సీజన్ పూర్తవుతున్నట్లు ఆహా సంస్థ ప్రకటించింది. చివరి ఎపిసోడ్‌కు సమంత భర్త నాగ చైతన్య గెస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆమె గురించి ఎన్నో రహస్యాలు లీక్ చేశాడు. ఇంట్లో ఎలా ఉంటుందో ఫన్నీగా వివరించాడు. ఇక, చివరి ఎపిసోడ్ కావడంతో సామ్ తర్వాత కంటిన్యూ అవుతుందో లేదోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

  English summary
  Samantha Akkineni is an Indian actress who has established a career in the Telugu and Tamil film industries, and is a recipient of several awards including four Filmfare Awards. While pursuing a degree in commerce, Akkineni worked part-time on modelling assignments.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X