పెళ్లి తర్వాత సమంత వర్కవుట్స్.. వావ్ అనేసిన హీరోయిన్స్
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతీ హీరో హీరోయిన్ తమ తమ సినీ, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండటం, భారీ ఫాలోయింగ్ ఏర్పరచుకోవడం నేటితరం నటీనటులు అలవాటుగా మార్చుకున్నారు. ఇక ఈ దారిలో యంగ్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత యాక్టివ్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎప్పుడూ నెట్టింట గేట్లు ఓపెన్ చేసి పెట్టే సామ్.. తాజాగా ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది.
ఈ వీడియోలో వ్యాయామం చేస్తూ కనిపించింది సమంత. వ్యాయామశాలలో కసరత్తులు చేస్తూ కేవలం చేతుల సాయంతోనే ఓ పోల్ ఎక్కడం, బాడీ షేప్ కోసం ఇతర కసరత్తులు చేయడం ఇందులో కనిపించాయి. పైగా ఈ వీడియోకి 'కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఎప్పుడూ వెనకడుగు వేయకండి. మీ సామర్థ్యం తెలిస్తే మీకే ఆశ్చర్యం కలుగుతుంది' అని కాప్షన్ పెట్టింది. దీంతో కొద్దీ సేపట్లోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక సమంత పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి పలువురు సినీ సెలెబ్రిటీలు స్పందించారు. మహేశ్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్ 'అద్భుతం అద్భుతం' అని కామెంట్ చేయగా.. కాజల్ అగర్వాల్ 'అమేజింగ్' అనేసింది. పూజా హెగ్డే అయితే 'వావ్ దట్స్ క్రేజీ' అని కామెంట్ చేసింది. మరో హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ 'వావ్!! వండర్ ఉమెన్' అంటూ రియాక్ట్ అయింది.
ఇటీవలే ఓ బేబీ సినిమాతో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న సమంత.. ప్రస్తుతం వెబ్ సిరీస్ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే షూటింగ్ పనులు కూడా మొదలు పెట్టేశారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











