ఎప్పుడో గర్భం దాల్చాను కానీ.. అసలు గుట్టు విప్పిన సమంత!!
సమంత-నాగచైతన్యలు తల్లిదండ్రులు కాబోతోన్నారనే వార్తలు కోకోల్లలుగా వచ్చాయి. వచ్చిన ప్రతీసారి అలాంటిదేమీ లేదని సమంత ఖండిస్తూనే వచ్చేది. సినిమాలకు గ్యాప్ ఇచ్చినా, ఇద్దరూ వెకేషన్‌లకు బయటకు వెళ్లినా సమంత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వచ్చేవి. ఇక వీటికి స్పందించి స్పందించి సమంతకు కూడా విసుగు వచ్చినట్టుంది. తాజాగా నెటిజన్ అడిగిన ఓ ప్రశ్నకు సమంత దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది.

సోషల్ మీడియాలో యాక్టివ్..
సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తనపై వచ్చే మీమ్స్‌ను సైతం లైట్‌గా తీసుకుని వాటిని కూడా షేర్ చేస్తుంది. ఇక ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తూ వేసే పంచ్‌లు తెగ వైరల్ అవుతుంటాయి. సౌత్‌లో సమంతకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ. అందుకే సమంత విషయాలు క్షణాల్లో ట్రెండ్ అవుతుంటాయి.

అర్బన్ ఫార్మింగ్..
సమంత లాక్ డౌన్‌లో కొత్త విషయాలను నేర్చుకుంది. అర్భన్ ఫార్మింగ్‌లో శిక్షణ తీసుకుని ఇంటి డాబాపైన కూరగాయాలను పండించుకుంది. సేంద్రియ వ్యవసాయం చేస్తూ గ్రో విత్ మీ అంటూ మిగిలిన సెలెబ్రిటీలకు ఛాలెంజ్ కూడా విసురుతోంది. మొత్తానికి సమంత ఆరోగ్యాన్ని రక్షించుకోవడం, మంచి ఆహారం తీసుకోవడంలో అత్యంత శ్రద్ద తీసుకుంటోంది.

డబ్బింగ్ పనుల్లో..
సమంత చాలా రోజుల డబ్బింగ్ థియేటర్లో అడుగుపెట్టే సరికి ఎంతో సంతోషించినట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో సమంత స్పషల్ రోల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న ఫోటోను షేర్ చేసింది సమంత.

ఫ్యాన్స్‌తో చిట్ చాట్..
తాజాగా సమంత తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలో ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. కుకింగ్, ఫార్మింగ్‌లో ఏది ఇష్టం అంటే ఫార్మింగ్ అని సమాధానం ఇచ్చింది. హైట్ ఎంత అని మరో అభిమాని అడిగితే 5 అడుగుల మూడు అంగుళాలు అని సమాధానం తెలిపింది.
Recommended Video

ఎప్పుడు గర్భం దాల్చాను..
మీరు ప్రెగ్నెంటా? అని ఇంకో నెటిజన్ సమంతను అడిగాడు. ఇక సమంత ఈ ప్రశ్నకు బాగానే సమాధానం చెప్పింది. నేను 2017లోనే గర్భం దాల్చాను కానీ ఇంకా బేబీ బయటకు రావడం లేదు అంటూ సెటైర్ వేసింది. సమంత ప్రెగ్నెన్సీపై ఎన్నో ఏళ్ల నుంచి ఫేక్ న్యూస్ వస్తున్నాయని పరోక్షంగా సెటైర్ వేసింది.


Click it and Unblock the Notifications











