అది నా బిడ్డ లాంటిది.. ఆనాడు నాకు ఆ స్థోమత లేదు.. సమంత ఎమోషనల్ పోస్ట్
సమంత నిన్న సాయంత్రం చేసిన ఓ పోస్ట్ అందరిలోనూ ఎన్నో అనుమానాలు రేకెత్తించింది. బిగ్ అనౌన్స్‌మెంట్ అంటోంది.. ఎంతో స్పెషల్ అంటోది? జీవితంతో ముడిపడి ఉందంటోంది? అసలు దేని గురించి సమంత చెబుతోందని ఎన్నో అనుమానాలు నెటిజన్లకు వచ్చాయి. అసలు సంగతేంటో సమంత తాజాగా తెలిపింది. తాను ప్రారంభించబోయే కొత్త వ్యాపారం గురించి సమంత ఎంతో ఎమోషనల్ అయింది. ఈ మేరకు సమంత చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సమంత కెరీర్ అలా..
సమంత సినిమాల్లోకి రాకముందు ప్యాకెట్ మనీ కోసం ఎంతలా కష్టపడిందో ఎన్నో సార్లు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. కాలేజ్‌లో చదువుకుంటున్న సమయంలో ఫ్యాషన్, మోడలింగ్ రంగాల్లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించుకునే దాన్ని అంటూ తన గతం గురించి, ఆ రంగాలపై ఉన్న ప్రేమ గురించి ఎన్నో సార్లు అభిమానులతో పంచుకుంది.

బిడ్డలాంటిది..
తాజాగా తాను ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో దిగుతున్నానని సమంత పేర్కొంది. ఈ మేరకు సొంత బ్రాండ్ గురించి చెబుతూ.. సాకీ ఫైనల్‌గా వచ్చింది. ఇది నా బిడ్డలాంటిది.. దీని కోసం ఎన్నో కలలు కన్నాను.. ఫ్యాషన్ పట్ల నాకున్న ప్రేమకు నిదర్శనమే ఇది. నా జీవిత ప్రయాణంలో దీనికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. నా సినిమా కెరీర్ ప్రారంభించకుముందు నుంచే ఫ్యాషన్ ప్రపంచం, మ్యాగజైన్‌లతో ముడిపడి ఉంది అని సమంత తెలిపింది.

స్థోమత లేదు..
కాలేజ్ నాటి విషయాలు నాకింకా గుర్తున్నాయి. ఆ సమయంలోఫ్యాషన్ డిజైనర్ దుస్తులను కొనుక్కునే స్థోమత కూడా నాకు లేదు. కానీ హీరోయిన్‌గా మారాక.. ఎందరో గొప్ప గొప్ప ఫ్యాషన్ డిజైనర్లు క్రియేట్ చేసిన దుస్తులను వేసుకున్నాను. చాలా ఏళ్ల తరువాత నా సంతకంతో ఉన్న దుస్తులను ధరించాను. ఇది ఎంతో ఎమోషనల్‌తో కూడుకున్న జర్నీ. నేను ఇంత దూరం వచ్చానంటే దానికి మీరు కురిపించిన ప్రేమే కారణం అని సమంత పేర్కొంది.
Recommended Video

త్వరలోనే లాంచ్..
ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఈ సాకి మన స్నేహబంధానికి, నా జీవితంతో ముడిపడున్నవారందరికీ ఎంతో స్పెషల్. మేము దీన్ని త్వరలోనే ప్రారంభించబోతోన్నాం. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. చూస్తూనే ఉండండి అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఈ దుస్తులు ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉంచేలా, తక్కువ ధరకే వచ్చేలా ఉంటాయని సమంత పేర్కొంది.


Click it and Unblock the Notifications











