Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
పాపం నాగ చైతన్య పరిస్థితి మరీ దారుణం.. సమంత చేతిలో బలి.. ఈ వారమంతా అదే పని!!
సమంత ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంతో చక్కగా వినియోగించుకుంటూ పది మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇంటిపైన వ్యవసాయం చేస్తూ అందర్నీ ఉత్సాహపరుచుతోంది. అర్బన్ వ్యవసాయాన్ని సమంత బాగా ప్రమోట్ చేస్తోంది. ఇంట్లోనే కూరగాయలన పండిస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుకుంటోంది. సేంద్రియ ఎరువులు వేస్తూ ఎంతో జాగ్రత్తగా పండించిన పంటనే ఇంట్లో ఉపయోగిస్తోంది. సమంత చేసే ఈ వ్యవసాయంపై సెలెబ్రిటీలు కూడా మనసు పారేసుకుంటున్నారు.
ప్రత్యేక శిక్షణ..
అర్భన్ ఫార్మింగ్‌లో సమంత కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంది. ఏ మొక్కలు పెంచాలి? ఎలా పెంచాలి? ఏ ఏ ఎరువులు వాడాలి? ఎలా చూసుకోవాలో తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఓ శిక్షకురాలిని పెట్టుకుంది. లాక్ డౌన్ ప్రారంభం అయిన నాటి సమంత అర్భన్ ఫార్మింగ్లోనే బిజీగా ఉంది.
మధ్యలో అప్డేట్స్..
తన మొక్కలు, తన బాల్కనీలో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన పనులు, వాటి అప్డేట్స్ గురించి చెబుతూ ఉండేది. అలా పెరిగిన కాయగూరలు, ఆకు కూరలను వండుతున్న వీడియోలను కూడా పెట్టేది. అందరూ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, మంచి ఆహారం తీసుకోవాలని సలహాలు కూడా ఇచ్చేది.
గ్రో విత్ మి చాలెంజ్..
ప్రస్తుతం సమంత ఓ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. తన వ్యవసాయ క్షేత్రాన్ని చూపిస్తూ.. అందరూ నాలా పండించండి అంటూ గ్రో విత్ మీ చాలెంజ్‌ను సమంత విసిరింది. నమత్ర, ఉపాసన వంటి వారు దానిపై స్పందించారు కూడా. ఇక సమంత తాజాగా చేసిన పోస్ట్ తెగ ఆకట్టుకుంటోంది.
Recommended Video
వారమంతా అదే పని..
సమంత తన వ్యవసాయ క్షేత్రంలో పండిన క్యారెట్స్‌ను చూపించింది. ఇందులో సమంత ఎంతో గర్వంగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా ఈ వారానికి కావాల్సిన మెనూ రెడీ అయిందని చెప్పుకొచ్చింది. క్యారెట్ జ్యూస్, క్యారెట్ పచ్చడి, క్యారెట్ హల్వా, క్యారెట్ ఫ్రై, క్యారెట్ పకోడి, క్యారెట్ ఇడ్లీ, క్యారెట్ సమోస అంటూ వారం రోజుల మెనునూ ఇలా క్యారెట్ వీక్‌గా మార్చేసింది. ఇలా వారం మొత్తం క్యారెట్ అంటే పాపం నాగ చైతన్య ఏమవుతాడో అని నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఇక చైతూ బలి అంటూ సరదాగా నవ్వుకుంటున్నారు.