ప్రామీస్‌గా చెబుతున్నాను ఇదే చివరిది.. సమంత పోస్ట్ వైరల్
సమంత ఈ మధ్య సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అసలే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే సమంత ఫిట్ నెస్ విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మధ్య ఉపాసన ప్రారంభించబోయే ఓ వెబ్ సైట్‌ను సమంతతో ప్రమోట్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో సమంతతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకుంది. ఈ క్రమంలోనే అదిరిపోయే ఫోటో షూట్లు చేసింది. జిమ్‌లో కష్టపడుతున్న ఫోటోలను సోషల్ మీడియలో షేర్ చేయడంతో అవి తెగ వైరల్ అయ్యాయి.
ఇక ఆ ఫోటోలను సమంత వరుసగా పోస్ట్‌లు చేస్తూనే ఉంది. జిమ్‌లో వ్యాయామం చేస్తూ అదిరిపోయే ఫోటోలను షేర్ చేసేది. ఇక ఈ క్రమంలో తాజాగా సమంత చివరగా ఓ ఫోటోను షేర్ చేస్తోన్నానను నమ్మండి అంటూ చెప్పుకొచ్చింది. ఇదే చివరిది.. ప్రామిస్ అంటూ నవ్వేసింది. పుష్ అప్స్ చేస్తోన్న సమంత ఫిట్ నెస్ చూసి ప్రతీ ఒక్కరూ ఫిదా అవుతున్నారు. సమంతా తాజాగా తన ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్‌ను ఇచ్చింది.

సమంత నటిస్తోన్న ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ అప్డేట్‌ను తాజాగా ఇచ్చింది. గత నెలలో డబ్బింగ్ పూర్తి చేసిన సమంత.. తాజాగా ఆసక్తికరమైన కామెంట్ చేసింది. ఈ వెబ్ సిరీస్‌కు సంబధించిన షూటింగ్ పూర్తి అయిందని పేర్కొంది. ఇక త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో ప్రత్యక్షం కానుంది. చూడాలి మరి మొదటి వెబ్ సిరీస్‌లో సమంత ఎలా మెప్పిస్తుందో. ఇది గానీ సమంతకు వర్కౌట్ అయితే ఓటీటీల్లోనూ సమంత హవా కొనసాగినట్టే.


Click it and Unblock the Notifications











