Don't Miss!
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్‌కు షాక్!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
చై-సామ్ భలే చక్కర్లు కొట్టారే.. ఇదంతా ఎప్పుడంటూ ఆరా!
టాలీవుడ్ క్యూట్ కపుల్స్ నాగ చైతన్య సమంత ఎంత అన్యోన్యంగా ఉంటారో అందరికీ తెలిసిందే. నాగ చైతన్య సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండకపోయినా.. సమంత మాత్రం దుమ్ములేపుతూ ఉంటుంది. చైతన్యకు సంబంధించిన విషయాలన్నీ అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. వంట చేసే వీడియోలు, పెట్స్‌తో ఆడుకునే వీడియోలను షేర్ చేస్తూ చైతూను ఆట పట్టిస్తూ ఉంటుంది. వెకేషన్స్‌కు వెళ్లినప్పుడు క్రమం తప్పకుండా ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పిక్ ఎంతో క్యూట్‌గా ఉండగా.. ఎన్నో అనుమానాలకు తావిచ్చింది.
చైతన్యకు రేసింగ్ అంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ స్టార్స్ వద్ద లేని అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కార్ చైతన్య వద్ద ఉందన్న విషయం తెలిసిందే. శ్రీమతితో కలిసి బైక్ మీద చక్కర్లు కొట్టినట్టు తెలుస్తోంది. వారి వాలకం చూస్తుంటే ఏదో దూర ప్రయాణం చేసినట్టు కనిపిస్తుంది. అయితే అందరికీ ఇక్కడే ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలే ఇది కరోనా కాలం, అంతటా లాక్ డౌన్ పటిష్టంగా అమలుపరుస్తున్నారు.
ఇలాంటి సమయంలో వీరిద్దరూ బైక్‌పై ఎలా చక్కర్లు కొడుతున్నారని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. సామ్ వెనకాల బ్యాగ్ తగిలించుకుని, హెల్మెట్ వెంట తీసుకెళ్లిన తీరును చూస్తే వీరు చాలా దూరం వెళ్లారని తెలుస్తోంది. అయితే ఇది ఇప్పటి పిక్ కాదని, గతంలో షికారుకు వెళ్లిన సమయంలోనే దిగి ఉంటారని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న సమంత.. మళ్లీ యాక్టివ్ అయింది. ఏదో ఒక అప్డేట్ పెడుతూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.