twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోకు!.. సమంతకు షాకిచ్చిన నాగచైతన్య

    |

    సమంత నాగచైతన్యల టాపిక్ ఎప్పుడు వచ్చిన ఓ విషయం మాత్రం హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఆ ఇద్దరూ ఎప్పుడు తల్లిదండ్రులు కాబోతోన్నారంటూ అన్ని వైపుల నుంచి ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. ఇలాంటి పర్సనల్ విషయాలపై ఎవ్వరూ అంతగా స్పందించరు. కానీ ఫ్యాన్స్ నెటిజన్స్ మాత్రం ఎప్పుడూ ఇలాంటి విషయాలపైనే శ్రద్ద చూపిస్తుంటారు. అక్కినేని బుల్లి వారసులు ఎప్పుడు వస్తారంటూ ప్రశ్నలు వేస్తుంటారు.

    సమంత అసహనం..

    సమంత అసహనం..

    ప్రతీసారి సమంతకు అలాంటి ప్రశ్నలు ఎదురవుతుండటంతో ఆ మధ్య సోషల్ మీడియాలో గట్టిగానే కౌంటర్ వేసింది. లాక్ డౌన్‌లో నెటిజన్లతో ముచ్చటించిన సమంతకు ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రశ్న ఎదురవ్వడంతో చిర్రెత్తుకొచ్చింది. ఎప్పుడో గర్భవతిని అయ్యాను కానీ పిల్లాడు బయటకు రావడం లేదు అంటూ కౌంటర్ వేసింది.

    ఇద్దరూ కెరీర్‌పైనే..

    ఇద్దరూ కెరీర్‌పైనే..

    ప్రస్తుతం చైతన్య, సమంత ఇద్దరూ కెరీర్‌పైనే ఫోకస్ పెట్టారు. సమంత వెండితెరపై ఫుల్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఇక తన డ్రీం ప్రాజెక్ట్ అయిన సాకీ వరల్డ్ ఫ్యాషన్ డిజైనర్ బ్రాండ్లపై దృష్టి పెట్టింది. మరో వైపు నాగ చైతన్య ఓ సాలిడ్ హిట్ కొట్టేందుకు ట్రై చేస్తున్నాడు. అందుకే అలాంటి వాటిపై అంతగా దృష్టి పెట్టలేదని తెలుస్తోంది.

     తాజాగా ఓ యాడ్‌లో..

    తాజాగా ఓ యాడ్‌లో..

    అయితే వీరిద్దరూ మాత్రం యాడ్లతో దుమ్ములేపుతున్నారు. జంటగా కలిసి చేసే యాడ్స్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. తాజాగా వీరిద్దరూ మింత్ర కోసం ఓ యాడ్ చేశారు. అందులో సమంత పండుగ కోసం షాపింగ్ చేద్దామని రెడీ అవుతుంది. నేను చేస్తాను అంటూ నాగచైతన్య ముందుకు వస్తాడు. మింత్ర యాప్ ఓపెన్ చేస్తాడు.

    అందరి కోసం బట్టలు..

    అందరి కోసం బట్టలు..

    అందులో అన్ని రకాలు బట్టలు, అన్ని వయస్సుల వారికోసం ఉంటాయని చెప్పేందుకు గానూ ఓ కాన్సెప్ట్‌ను డిజైన్ చేశారు. నాన్న కోసం ఈ బట్టలు బాగుంటాయ్ అని చైతన్య చెప్పడం, తమ్ముడి కోసం ఇవి బాగుంటాయని అనడం, అమ్మకు ఈ చీర బాగుంటుందని చైతన్య అనడం, ఈ కలర్ అమ్మకు ఫేవరేట్ అని సమంత అనడం వరకు బాగానే ఉంది.

    అలాంటి ఆలోచనలు..

    అలాంటి ఆలోచనలు..

    ఇక సమంత మళ్లీ కొన్ని బట్టలను చూస్తుంది. అయితే అవి చిన్న పిల్లల కోసం కావడంతో చైతన్య కాస్త వెరైటీగా చూస్తాడు. ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకు అంటూ సమంతతో కొంటెగా అంటాడు. దీంతో సమంత తెగ సిగ్గుపడిపోయింది. యాడ్‌లో అలా చెప్పినా కూడా వీరి మనసులోనూ అదే ఉన్నట్టు తెలుస్తోంది.

    English summary
    Samantha And Naga Chaitanya Myntra Ad, estive shopping for us means shopping for all our loved ones. And with something stylish for everyone in the family
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X