సమంత, నాగ చైతన్య విడాకుల కథలో బిగ్ ట్విస్ట్: ఆ పార్టీ తర్వాతే విభేదాలు.. ముందు అడిగింది తనేనట!

సుదీర్ఘ కాలం పాటు ప్రేమాయణం సాగించి.. కొన్నేళ్ల క్రితం అగ్నిసాక్షిగా ఒక్కటై.. ఇటీవలే విడాకులు తీసుకున్నారు టాలీవుడ్ కపుల్ సమంత, నాగ చైతన్య. సినిమాల ద్వారా ప్రేమలో పడిన వీళ్లిద్దరూ వివాహ బంధం మొదలైన తర్వాత నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే మధ్యలో ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తడంతో దూరంగా ఉంటూ వచ్చారు. ఇలా కొద్ది నెలల పాటూ వేరు వేరుగా ఉంటూ వచ్చిన చై సామ్.. గత అక్టోబర్‌లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

Recommended Video

Samantha - 'It's All Because Of Bunny' | Filmibeat Telugu

ఇది జరిగి చాలా రోజులు అవుతోన్న నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. దీంతో ఈ కథలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

అలా మొదలైన లవ్.. పెళ్లి చేసుకుని

అలా మొదలైన లవ్.. పెళ్లి చేసుకుని

అక్కినేని నాగ చైతన్య.. సమంత కలిసి ‘ఏమాయ చేశావే' సినిమా చేశారు. అప్పుడే ఆమెకు మనోడు ఫ్లాట్ అయిపోయాడు. ఈ సినిమా సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లిద్దరూ.. ‘ఆటోనగర్ సూర్య' సినిమా చేసిన టైమ్‌లో ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించి ఆ తర్వాత ఈ సినీ జంట అగ్నిసాక్షిగా ఒక్కటైంది.

పెళ్లి తర్వాత ఫుల్ ఎంజాయ్ చేశారు

పెళ్లి తర్వాత ఫుల్ ఎంజాయ్ చేశారు

పెళ్లి చేసుకున్న తర్వాత సమంత, నాగ చైతన్య ఎంతో క్రేజీగా గడిపారు. తరచూ పార్టీలు చేసుకోవడం, హాలీడే ట్రిప్‌లకు వెళ్లడం వంటివి చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే తమకు సంబంధించిన పర్సనల్ విషయాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటూ వచ్చారు. అదే సమయంలో ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉంటూ ఎన్నో విజయాలను కూడా అందుకున్నారు.

విడాకులు ప్రకటించిన చైతూ.. సామ్

విడాకులు ప్రకటించిన చైతూ.. సామ్

టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నాగ చైతన్య - సమంత విడాకులు తీసుకున్నారు. తద్వారా నాలుగేళ్ల తమ వివాహ బంధానికి పుల్‌స్టాప్ పెట్టేశారు. ఈ విషయాన్ని గత అక్టోబర్‌లో అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఇకపై తామిద్దరం భార్యా-భర్తలుగా కొనసాగలేమని, చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

విడిపోవడంపై ఎన్నో అనుమానాలు

విడిపోవడంపై ఎన్నో అనుమానాలు

నాగ చైతన్య.. సమంత విడాకులు తీసుకుంటున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వాళ్లు దీన్ని నిజం చేసేశారు. దీంతో అసలు వీళ్లిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు? దీని వెనుక కారణాలు ఏంటి? వీళ్లిద్దరి మధ్య ఏ విషయాల్లో మనస్పర్థలు వచ్చాయి? ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ, ఎవరూ దీనిపై బహిరంగంగా స్పందించలేదు.

నాగార్జున స్పందన.. కథలో బిగ్ ట్విస్ట్

నాగార్జున స్పందన.. కథలో బిగ్ ట్విస్ట్

సమంత, నాగ చైతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారన్న విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే అక్కినేని నాగార్జున ఓ మీడియాతో మాట్లాడుతూ దీనిపై స్పందించాడు. ‘నాగ చైతన్య ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా సంకోచించాడు. మా కుటుంబం గురించి, నా గురించి చాలా దిగులు పడ్డాడు' అంటూ ట్విస్ట్ ఇచ్చే విషయాలు చెప్పాడు.

ముందు అడిగింది తనేనని చెప్పాడు

ముందు అడిగింది తనేనని చెప్పాడు

దీనిపై నాగార్జున స్పందిస్తూ.. ‘తన (సమంత) కోరిక మేరకే చైతూ కూడా ఒప్పుకున్నాడు. విడాకులు తీసుకునే సమయంలో నేను కంగారుపడతాను అనుకుని అతడు నన్ను చాలా ఓదార్చాడు. వీళ్లిద్దరూ 4 ఏళ్లుగా కలిసి ఉంటున్నారు. కానీ వాళ్ల మధ్య అలాంటి సమస్యే రాలేదు. ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నారు . ఈ నిర్ణయానికి ఎలా వచ్చారో నాకు తెలియదు' అని చెప్పాడు.

ఆ పార్టీ తర్వాతే సమస్యలు అంటూ

ఆ పార్టీ తర్వాతే సమస్యలు అంటూ

సమంత, నాగ చైతన్య విడాకులు గురించి నాగార్జున మరింతగా మాట్లాడుతూ.. ‘చై సామ్ 2021 న్యూ ఇయర్‌ పార్టీని కూడా కలిసి జరుపుకున్నారు. అయితే, ఆ తర్వాతే ఇద్దరి మధ్య సమస్యలు తలెత్తినట్లు అనిపిస్తుంది' అంటూ మరింత వివరణ ఇచ్చాడు. కానీ, అసలు వీళ్లిద్దరూ ఎందుకు విడిపోయారు అన్న దానిపై మాత్రం ఈ అక్కినేని హీరో సమాధానాన్ని దాటవేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X