For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నయనతారతో అలా వరస కలిపేసిన సమంత.. అది విఘ్నేశ్ శివన్ కలిపిన బంధమేనా?

    |

    నయన తార, సమంత ఇద్దరూ ఇద్దరే. ప్రస్తుతం ఇద్దరి స్టేటస్ ఒక్కటే. అయితే నయనతారను లేడీ సూపర్ స్టార్ అంటూ కిరీటాన్ని పెట్టేశారు అభిమానులు. సమంతను కూడా అదే పేరుతో పిలిస్తే.. ఆల్రెడీ నయనతార ఉంది కదా.. ఆమె ట్యాగ్‌ను లాగి నాకు పెడతారా? అని అప్పట్లో ఓ సెటైర్ వేసింది. అయితే సమంత కూడా లేడీ సూపర్ స్టార్ అనిపించుకోగల సత్తా ఉంది. ఆల్రెడీ సమంత సూపర్ స్టార్ అని నిరూపించుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. హీరోయిన్ల విషయంలో నెంబర్ పొజిషన్లలో ఎప్పుడూ అంతగా వివాదాలు రావు.

    నెంబర్ వన్ రేసులో..

    నెంబర్ వన్ రేసులో..

    దక్షిణాది హీరోయిన్లలో ప్రస్తుతంలో నెంబర్ వన్ ఎవరన్న చర్చ జరగుతూ ఉంటుంది. ఈ రేసులో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. స్వీటీ అనుష్క, నయనతార, సమంత, కీర్తి సురేష్, కాజల్ ఇలా చాలా మందే ఈ వరుసలో నిల్చున్నారు. ఇందులో ఎవరికి వారే మేటి. ఒకరితో ఒకరిని పోల్చలేం. అయితే క్రేజ్ దృష్ట్యా, పారితోషకాల దృష్ట్యా అందరి కంటే నయనతారే ముందంజలో ఉంటుంది.

    లేడీ సూపర్ స్టార్ ట్యాగ్..

    లేడీ సూపర్ స్టార్ ట్యాగ్..

    నయనతార తమ సినిమాల్లో ఉంటే ఓ నిండుదనం ఉంటుందని కొందరు అనుకుంటే.. ఇంకొందరు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారు. గ్లామరస్ రోల్స్ అయినా వెయిట్ ఉండి ఎమోషన్స్ పండించే సీన్స్ అయినా నయన్ తనదైన శైలిలో దుమ్ములేపుతుంది. ప్రస్తుతం నయనతారకు సరిసమానంగా సమంత ఎదిగింది.

    అందుకే అలా..

    అందుకే అలా..

    నయన్, సమంతల క్రేజ్ ఒకే స్థాయిలో ఉందని విఘ్నేశ్ శివన్ ఈ ఇద్దరితో ఓ సినిమాను ప్లాన్ చేశాడు. ఒక లేడీ సూపర్ స్టార్ ఉంటేనేసినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అలాంటిది నయనతార, సమంతలను పెట్టి సినిమా అంటే విఘ్నేశ్ ఏదో పెద్ద ప్లానే వేశాడు. అయితే ఈ ప్రాజెక్ట్ చర్చల్లో భాగంగానే నయన్, సమంతల మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడినట్టుంది.

    అక్కా అనేసింది..

    అక్కా అనేసింది..

    తాజాగా సమంత నయనతారకు బర్త్ డే విషెస్ చెప్పింది. ఆ ట్వీట్‌లో నయన్‌‌ను అక్కా అనేసింది. నయనతార హ్యాపీ బర్త్ డే.. మనకంటూ ఉన్న వాటికోసం మనం పోరాడాలి.. ఈ విషయంలో మమ్మల్ని ఇంకా ఇన్‌స్పైర్ చేస్తూనే ఉండాలి.. ఇంకా మెరగువుతూనే ఉండాలి.. నీకు మరింత బలం రావాలి సిస్టర్.. నీ బలానికి, నీ పట్టుదలకు సెల్యూట్ అని సమంత ట్వీట్ చేసింది.

    English summary
    Samantha Calls Nayanthara As Sister, Happy birthday to the one and only NayantharaBeating heart.. Keep shining brighter and brighter and inspiring us to fight for what is ours .More power to you Raised fistsister.. Salute your strength and silent determination
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X