సమంత ఫ్రెండ్‌కు కరోనా.. ఇలా చేస్తే వైరస్ దూరమవుతుంది.. శిల్పా రెడ్డి వీడియో వైరల్
సమంత ఫ్రెండ్‌కు కరోనా, సమంతకు కూడా కరోనా అని రెండు మూడు రోజుల నుంచి ఒకటే వార్తలు వైరల్ అయ్యాయి.అయితే సమంత క్షేమంగా ఉందని, ఎలాంటి కరోనా సోకలేదని క్లారిటీ వచ్చింది. అయితే సమంత స్నేహితురాలు శిల్పా రెడ్డికి మాత్రం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో సమంతకు కూడా సోకి ఉంటుందని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే సమంత మాత్రం క్షేమంగా ఉందనే వార్త బయటకు వచ్చింది. అదే సమయంలో శిల్పా రెడ్డి కూడా తన పరిస్థితిని వివరిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది.

నాగ్ సైతం..
కింగ్ నాగార్జున సైతం శిల్పా రెడ్డి వీడియోను చూడండని సలహా ఇచ్చాడు. ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని, అయితే వాటిని ఎలా జయించాలో ఎంతో స్ఫూర్తివంతమైన సలహాలు ఇస్తోందని ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంతకీ ఆమె చెప్పిన సలహాలు, సూచనలు ఏంటో ఓసారి చూద్దాం.

అలా కరోనా వచ్చింది..
సమంతకు నిత్యం తోడుగా ఉండే శిల్పా రెడ్డి తనకు కరోనా ఎలా వచ్చిందో చెప్పుకొచ్చింది. తన ఇంటికి ఎవరో బంధువులు వచ్చారని, ఆపై వారిలో ఎవరికో ఒకరికి కరోనా వచ్చిన సమాచారం తెలిసిందని పేర్కొంది. ఆపై తమకూ పరీక్షలు నిర్వహించారని, దాంతో తనకు, తన భర్తకు పాజిటివ్ వచ్చిందని తెలిపింది.

ఎలాంటి లక్షణాలు లేవు..
అయితే తమకు ఎలాంటి లక్షణాలు లేవని అయినా పాజిటివ్ వచ్చిందని తెలిపింది. కరోనా ఎవ్వరికైనా వస్తుందని చెప్పడమే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణమని పేర్కొంది. అయితే శ్రద్దగా వ్యాయామం, కొన్ని చిట్కాలు పాటిస్తే కరోనాను జయించవచ్చని చెప్పుకొచ్చింది.
Recommended Video

ఇలా చేయాలి..
తగిన జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన పౌష్టికాహారం, డైట్ పాటిస్తే కరోనా నుంచి బయటపడవచ్చని వివరించింది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలిపింది. ప్రతిరోజు తప్పక వ్యాయామం అందులోనూ ప్రాణాయామం తప్పనిసరిగా చేయాలని తెలిపింది. వెల్లుల్లి, లవంగాలు, తులసి ఆకులు, మిరియాలు, పుదీనా ఆకులు రోగ నిరోధక శక్తిని పెంచుతాయని పేర్కొంది.


Click it and Unblock the Notifications











