కొందరు అంతే ఎప్పటికీ నేర్చుకోలేరు.. ఆ బలహీనత గురించి చెప్పిన సమంత
సమంత గత వారమంతా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. పూజా హెగ్డే కామెంట్స్‌తో సమంత సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమంత ఏ మాత్రం అందంగా లేదని పూజా హెగ్డే కామెంట్ చేయడం, హ్యాకింగ్ అయిందని మళ్లీ కప్పిపుచ్చుకోవడం, సమంత పరోక్షంగా సెటైర్స్ వేయడం, నందినీ రెడ్డి-చిన్మయి వంటి వారు పంచ్‌లు వేయడం ఇదంతా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయింది. తాజాగా సమంత తనలోని బలహీనత గురించి అందరికీ చెప్పింది. అదేంటో ఓ సారి చూద్దాం.

ఆ వ్యవహారం వైరల్..
మజిలీ చిత్రాన్నీ విక్షించిన పూజా హెగ్డే సమంత అంత అందంగా లేదని కామెంట్ చేసింది. ఆ తరువాత కొద్దిసేపటికే తన అకౌంట్ హ్యాక్ అయిందని ట్వీట్ చేసింది. అంతలోపై ఆ కామెంట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మలుపులు తిరిగి..
అయితే మొదటగా సమంతకు క్షమాపణలు చెప్పాల్సిందేనని పూజాహెగ్డేపై ఒత్తిడిని తీసుకొచ్చారు. అయితే నందినీరెడ్డి, చిన్మయి, సమంత వేసుకున్న కుళ్లు జోకుల స్క్రీన్ షాట్లు వైరల్ కావడంతో పూజా హెగ్డేకు మద్దతు పెరిగింది. ఇలా ఆ వ్యవహారం టర్న్ తీసుకుంది. దీంతో హర్ట్ అయిన సమంత మంచి మనసు ఉంటే కూడా బాదే.. వారిని లోకం పిచ్చివారిగా చూస్తుందని పోస్ట్ చేసింది.

ఆర్గానిక్ ఫార్మింగ్..
సమంత తన ఇంటిపై వ్యవసాయం చేస్తోంది. ఈ అర్బన్ ఫార్మింగ్ ఎప్పటి నుంచో ఫేమస్. మిద్దెపైన వ్యవసాయ చేయడం సిటీ కల్చర్‌గా మారింది. సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తూ ఇంటికి కావాల్సినవన్నీ సమకూర్చుకుంటున్నారు. సమంత కూడా ఈ పద్దతినే ఫాలో అవుతోంది.
Recommended Video

ఇప్పటికీ నేర్చుకోలేకపోతోంది..
సమంత తాజాగా ఓ పోస్ట్ చేస్తూ తాను ఓ పనిని మాత్రం ఇప్పటికీ నేర్చుకోలేకపోతున్నానని తెలిపింది. తనకు కొబ్బరి కాయను పగలగొట్టడం మాత్రం రావడం లేదట. దాదాపు 50 చిత్రాలు అంటే 50 కొబ్బరి కాయలు కొట్టిన ప్రాక్టీస్ అయినప్పటికీ నేర్చుకోలేకపోతున్నానని, కొందరు అంతే ఎప్పటికీ నేర్చుకోలేరని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











