సమంతకు కూడా అలాంటి అనుభవం.. అందుకే అలా చేసిందట!!

అసలే ఇది సోషల్ మీడియా యుగం. సెలెబ్రిటీల నంబర్లు కూడా ఇట్టే కనిపెట్టేస్తుంటారు. ప్రస్తుతం అంతా ఆన్ లైన్ మయం అయిన సందర్భంలో పర్సనల్ నంబర్ ఇవ్వడమన్నది అనివార్యమైంది. మామూలు జనాలకు అది కామనే అయినా.. సెలెబ్రిటీలకు మాత్రం అది కష్టంగా మారుతుంది. అందులో మరీ ముఖ్యంగా హీరోయిన్ల నంబర్లు లీక్ అయితే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. సమంత కూడా ఇలాంటి కష్టాలను ఎదుర్కొందట.

ఫేక్ కాల్స్..

ఫేక్ కాల్స్..

షాపింగ్ కు వెళ్లినా ఆన్ లైన్ లో ఏదైనా ఆర్డర్ ఇచ్చి నా , లేదా ఫుడ్ ఆర్డర్ పెట్టి నా మొబైల్ నెంబర్ పెద్ద తలనొప్పిగా మారిందంటుంది. ఇక దాని వల్ల ఫోన్ల మీద ఫోన్లు వస్తుంటాయి.. మన నంబర్లు ఎక్కడెక్కడి వెళ్లిపోతాయి అంటూ సెలెబ్రిటీల బాధలను సమంత చెప్పుకొచ్చింది.

పర్సనల్ నంబర్ బయటకు..

పర్సనల్ నంబర్ బయటకు..

అలాంటి వాటి నుంచి తప్పించుకునేందుకు తాజాగా ఓ యాప్ వచ్చిందని తెలిపింది. ఫైనల్‌గా మాలాంటి వారి బాధలను గుర్తించి మాకోసం శ్రమించి ఇలాంటి యాప్‌ను తయారుచేయడం హ్యాపీగా ఉందని సమంత పేర్కొంది. ఈ ప్రవేట్ యాప్ ద్వారా పర్సనల్ నెంబర్ బయటకు వెళ్లే అవకాశం ఉండదని చెప్పింది.

దూస్రా యాప్..

దూస్రా యాప్..

దాంతో మన ప్రైవసీకి ఇబ్బంది కలగదు అని చెప్పుకొచ్చింది. ఆన్ లైన్‌లో ఒకటి ఆర్డర్ ఇస్తే వేరే పది మంది కాల్స్ , మెసేజ్ లు చేస్తారు. అదెలా జరుగుతోంది.. అంటే మన నంబర్ అలా అలా పోతూనే ఉంటుందని సమంత చెప్పుకొచ్చింది. అలాంటి వాటి నుంచి తప్పించుకునేందుకే ఈ దూస్రా యాప్ బాగా ఉపయోగపడుతుందని సమంత తెలిపింది.

కొత్త నంబర్..

కొత్త నంబర్..

దూస్రా యాప్ ద్వారా సిమ్ లేకపోయినా మరో నంబర్ వస్తుందని, దాని వల్ల మన వ్యక్తిగత నంబర్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పుకొచ్చింది. తాను ఈ దూస్రా యాప్‌లో జాయిన్ అయ్యానని, ఓ కొత్త నంబర్ తీసుకున్నానని పేర్కొంది. ప్రస్తుతం సమంత ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. ఈ మధ్యే డబ్బింగ్ కూడా పూర్తి చేసేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X