వైన్ విత్ పిజ్జా: స్పెయిన్ వెకేషన్లో సమంత గ్లామర్ విశ్వరూపం!
Recommended Video
హీరోయిన్ సమంత తన భర్త నాగ చైతన్యతో కలిసి ప్రస్తుతం స్పెయిన్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడి ప్రతి మూమెంటును తాను ఎంతగా ఎంజాయ్ చేస్తున్నానో వెల్లడిస్తూ ఆ మధుర క్షణాలను అభిమానులతో పంచుకుంటోంది. వీరి స్పెయిన్ వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పక్కనే తనను ప్రాణంగా చూసుకునే ప్రేమికుడు, ఇష్టమైన ఫుడ్, నోరూరించే వైన్, సాయంత్రం వేళ సేద తీరడానికి సముద్రం ఒడ్డున ఏకాంత సమయం... ఇంతకు మించిన సంతోషం ఏముంటుంది? అందుకే సమంత ఫుల్ హ్యాపీగా గడుపుతోంది. గతేడాది వరుస సినిమా షూటింగులతో బిజీగా గడిపిన ఆమె ప్రస్తుతం హ్యాపీగా రిలాక్స్ అవుతోంది.

గ్లామరస్ ఫోటోలు షేర్ చేసిన సామ్
ఈ సందర్భంగా సమంత కొన్ని గ్లామరస్ ఫోటోలు షేర్ చేశారు. పెళ్లి తర్వాత ఆమె సినిమాల్లో గ్లామర్ షో తగ్గించేసిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత సామ్ మళ్లీ ఇలా గ్లామరస్ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సూపర్ హాట్ సామ్, సెక్సీ లుక్ అంటూ పొగడ్తలు గుప్పిస్తున్నారు.

వైన్, పిజ్జా.. సూపర్ హ్యాపీ
సమంతకు పిజ్జా తింటూ వైన్ టేస్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆ రెండు ఉంటే ఆమె మొహం ఎంత ఆనందంగా వెలిగిపోతుందో చెప్పడానికి ఈ ఫోటోయే నిదర్శం. స్పెయిన్ టూర్లో సామ్ తన డైటింగ్ ఆంక్షలు కూడా పక్కన పెట్టేసిందట. ఫుల్లుగా పిజ్జాలు లాగిస్తూ, కావాల్సినంత వైన్ తాగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇండియాలో కుదరకే...
సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఇండియాలో ఇలా నచ్చిన దుస్తులు వేసుకుని హోటల్స్, రెస్టారెంట్ష్ తిరుగుతూ ఎంజాయ్ చేయడం సాధ్యం కాదు. ఎక్కడికి వెళ్లినా అభిమానుల హడావుడి ఉంటుంది. అందుకే వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు తన భర్తతో కలిసి స్పెయిన్లో వాలిపోయింది.

నాగ చైతన్య, సమంత
నాగ చైతన్య, సమంత సినిమాల విషయానికొస్తే ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘మజిలీ' చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయం అందుకుంది. ప్రస్తుతం సమంత ‘ఓ బేబీ' సినిమాతో పాటు ‘మన్మధుడు 2'లో గెస్ట్ రోల్ చేస్తోంది. నాగ చైతన్య తన మేనమామ వెంకటేష్‌తో కలిసి ‘వెంకీ మామ' అనే చిత్రం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











