Just In
- 2 min ago
‘సర్కారు వారి పాట’ నుంచి స్పెషల్ వీడియో: మహేశ్ మూవీపై కీర్తీ సురేష్ పోస్ట్
- 47 min ago
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- 1 hr ago
భర్త చేసిన పనికి అప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక.. ఏకంగా వీడియో రిలీజ్ చేసి..
- 1 hr ago
మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది
Don't Miss!
- Sports
పుజారా.. బ్యాటింగ్ చేస్తుంటే నీకు బోర్ కొట్టదా?! వెలుగులోకి మరో ఆసీస్ ప్లేయర్ స్లెడ్జింగ్!
- Automobiles
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జీవితంలో మోస్ట్ మెమోరబుల్ పిక్ అదేనట.. నాగ చైతన్యతో సమంత కథ అక్కడే షురూ!
సమంత నాగ చైతన్య కథ ఎక్కడ మొదలైందో అందరికీ తెలిసిందే. ఏ మాయ చేసావే సినిమాతో సమంత నాగ చైతన్య జంట బాగా క్లిక్ అయింది. అక్కడ మొదలైన స్నేహ బంధమే రాను రాను ప్రేమగా మారింది. అయితే మొదటి సినిమాతోనే బాగా క్లోజ్ అయ్యారట. అప్పటి నుంచి వారిద్దరి మధ్య వ్యవహారం నడుస్తున్నా కూడా ఏ ఒక్కరూ కనిపెట్టలేకపోయారని ఆ మధ్య ఇంటర్వ్యూల్లో అసలు విషయం చెప్పింది. తాజాగా ఈ విషయాలన్నీ మాట్లాడుకోకవడానికి ఓ కారణం ఉంది.

కొత్త ట్రెండ్ అంటూ..
కొత్త ట్రెండ్ మొదలుపెడదాం.. ఎలా ఉంటుందో ట్రై చేద్దాం.. అంటూ సమంత తన ఫాలోవర్లతో ఓ ఆట ఆడింది. ఏ ఫోటోలు అయినా అడగండి నేను పంపిస్తాను అంటూ నెటిజన్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు వెరైటీ ఫోటోలను అడిగారు.

షేర్ చేసిన సమంత..
నెటిజన్లు సమంతను రకరకాల ఫోటోలను అడిగారు. తింటున్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు, నవ్వినప్పుడు, భర్తతో ఉన్నప్పుడు, హష్‌తో వింతగా ప్రవర్తిస్తున్నప్పుడు.. ఎవ్వరూ చూడని ఫోటో, ఫోన్‌లో లేటెస్ట్‌గా దిగిన ఫోటో, మేకప్ లేని ఫోటో, నాగార్జునతో దిగిన ఫోటో అంటూ ఇలా నెటిజన్లు అడిగిన వెరైటీ ఫోటోలన్నీ పంపించింది.

హార్ట్‌లో ఉండే ఫోటో..
ఓ నెటిజన్ మాత్రం నిజంగా టచ్ చేశాడు. మీ హృదయంలో నిలిచిపోయిన ఫోటోను షేర్ చేయండని సమంతను అడిగాడు. పెళ్లి నాటి ఫోటోను షేర్ చేసి పరోక్షంగా నాగ చైతన్య మీదున్న ప్రేమను వ్యక్తపరిచింది. మరో నెటిజన్ అడిగిన ఫోటోతో సమంత ఎక్కడో ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లినట్టుంది.

మోస్ట్ మెమోరబుల్ ఫోటో..
ఓ నెటిజన్ సమంతను గతంలోకి తీసుకెళ్లాడు. మోస్ట్ మెమోరబుల్ ఫోటోను షేర్ చేయండని సమంతను కోరారు. అలా ఏమాయ చేసావే నాటి రొమాంటిక్ ఫోటోను షేర్ చేసింది సమంత. అది ఫప్ట్ ఫోటో షూట్ అంటూ నాగ చైతన్యతో దిగిన ఫోటోను షేర్ చేసింది.

అక్కడే మొదలైనట్టుంది..
అలా ఏ మాయ చేసావే ఫోటో షూట్ సమయంలోనే ఈ ఇద్దరి కథకు భీజం పడ్డట్టుంది. మొత్తానికి ఇన్నేళ్లకు ఇలా టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో ఒకరిగా ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.