Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సమంత, చైతూకి దగ్గరైన హాష్ అక్కినేని, డ్రోగో అక్కినేని.. 8 ఏళ్లు పట్టిందట.. ఆ ఇద్దరు ఎవరంటే!
సమంత, నాగచైతన్య అక్కినేని వైవాహిక జీవితం బ్రహ్మండంగా సాగుతున్నది. ఓ వైపు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే.. వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్నారు. సినిమా రిలీజ్ తర్వాత గ్యాప్ దొరికితే విదేశాలకు వెళ్లి లైఫ్‌ను మధురానుభూతిగా మలుచుకొంటున్నారు. తాజాగా మజిలీ సక్సెస్ తర్వాత వెకేషన్‌కు వెళ్లొచ్చిన వారిద్దరూ ప్రస్తుతం తమకు ఇష్టమైన నేస్తాలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ ప్రియ నేస్తాల గురించి వెల్లడించారు.
విహారయాత్రకు వెళ్లొచ్చిన సమంత దంపతులు
మజిలీ తర్వాత స్పెయిన్‌లో విహారయాత్ర చేసి వచ్చాం. అక్కడ బాగా ఎంజాయ్ చేసినప్పటికి.. మనసంతా ఇక్కడే ఉంది. చాలా రోజులు మా పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం బాధగా ఉండేది. వాటికి దూరంగా ఉండటం వల్ల ధ్యాసంతా ఇక్కడే ఉండేది. హైదరాబాద్‌కు ఎప్పుడెప్పుడు వద్దామా అన్నట్టు ఫీలయ్యాం అని చైతు దంపతులు వెల్లడించారు.
పెంపుడు కుక్కలతో ఎంజాయ్
ప్రస్తుతం సమంత దంపతులకు హాష్ అక్కినేని, డ్రోగో అక్కినేని అనే రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయి. వాటికి ప్రస్తుతం నాగచైతన్య, సమంత తమ టైమ్‌ను కేటాయించి ఎంజాయ్ చేస్తున్నారు. వాటితో ఆడుకొంటున్న ఫొటోలను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ముద్దు ముద్దుగా ఉన్న పప్పీలతో సమంత, చైతూ కనిపించారు.
షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల
హాష్, డ్రోగోలతో మాకు 8 సంవత్సరాల అనుబంధం ఉంది. వాటితో రిలేషన్ పెంచుకోవడానికి చైతూకు చాలా సమయం పట్టింది. షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల వాటితో ఎక్కువగా సన్నిహితంగా ఉండలేకపోయాం. ఇప్పుడు వాటితో ఆడుకొనేందుకు సమయం లభిస్తున్నది. చైతూకు కూడా ఆ రెండు అంటే ఇష్టం కావడంతో ఇంట్లో ఉంటే అవే మాకు ప్రపంచం అని సమంత వెల్లడించింది.
ఓ బేబీగా సమంత అక్కినేని
సమంత కెరీర్ విషయానికి వస్తే, మజిలీ తర్వాత దర్శకురాలు నందినీ రెడ్డి రూపొందించే ఓ బేబీ మూవీలో నటిస్తున్నది. అలాగే తమిళంలో ఘన విజయం సాధించిన 96 మూవీ రీమేక్‌లో శర్వానంద్‌తో జతకట్టింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి పోషించిన పాత్రను శర్వానంద్ చేస్తున్నారు. మజిలీ తర్వాత ఆర్ఎక్స్ 100 దర్శకుడితో పనిచేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కొత్త ప్రాజెక్ట్‌ను నాగ చైతన్య ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.