సమంత సంచలన నిర్ణయం.. అక్కినేని ఫ్యామిలీకి దూరంగా సొంత కుంపటి

By Manoj Kumar P

దాదాపు పదేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవా చూపిస్తోంది స్టార్ హీరోయిన్ సమంత. నాగ చైతన్య నటించిన 'ఏ మాయ చేశావే' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయిన ఆమె.. మొదటి సినిమాలోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా పలు హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ క్రమంలోనే అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో పడి.. అతడిని వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యామిలీని కాదని సమంత ఓ సంచలన నిర్ణయం తీసుకుందట. ఈ షాకింగ్ న్యూస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.

Recommended Video

Happy Birthday Samantha: Baby Samantha Akkineni Turns 33
సమంత వరుస విజయాలకు బ్రేకేసిన జాను

సమంత వరుస విజయాలకు బ్రేకేసిన జాను

కొన్నేళ్లుగా సమంత వరుస విజయాలతో దూసుకుపోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అఆ'ను మొదలుకొని ఆమె ‘జనతా గ్యారేజ్', ‘రంగస్థలం', ‘మహానటి', ‘యూటర్న్', ‘మజిలీ', ‘ఓ బేబీ' వంటి హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అలాగే, తమిళంలోనూ కొన్ని విజయాలు అందుకుంది. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన ‘జాను' ఆమె వరుస విజయాలకు బ్రేక్ వేసింది.

తొలిసారి అలాంటి పాత్రలో అక్కినేని కోడలు

తొలిసారి అలాంటి పాత్రలో అక్కినేని కోడలు

‘జాను' తర్వాత సమంత మరే సినిమాకూ సంతకం చేయలేదు. అయితే, ఆమె ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సిరీస్‌లో అక్కినేని వారి కోడలు నెగెటివ్ రోల్ చేస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ‘ద ఫ్యామిలీ మ్యాన్'కు కొనసాగింపుగా ఇది రూపొందుతోంది.

తల్లి కాబోతున్న సమంత.. సినిమాలకు దూరం

తల్లి కాబోతున్న సమంత.. సినిమాలకు దూరం

నిన్న మొన్నటి వరకు వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపింది సమంత. ఎప్పుడూ ఆమె చేతిలో రెండు మూడు సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంది. అయితే, ఇప్పుడు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేకపోవడంతో.. ఆమె తల్లి కాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే సమంత సినిమాలు ఒప్పుకోవడం లేదన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

భర్తతో మరోసారి సమంత.. మళ్లీ ఆమెతోనే

భర్తతో మరోసారి సమంత.. మళ్లీ ఆమెతోనే

సమంత తన భవిష్యత్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటన చేయకపోయినప్పటికీ.. ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె తన భర్త చైతూతో కలిసి మరోసారి నటించబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని నందినీ రెడ్డి తెరకెక్కిస్తుందని అంటున్నారు. గతంలో వీళ్లిద్దరూ ‘ఏమాయ చేశావే', ‘మనం', ‘ఆటోనగర్ సూర్య', ‘మజిలీ'లో కలిసి నటించారు.

అక్కినేని ఫ్యామిలీకి దూరంగా సొంత కుంపటి

అక్కినేని ఫ్యామిలీకి దూరంగా సొంత కుంపటి

తాజాగా సమంత గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. అక్కినేని ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టూడియోస్ అనే ప్రొడక్షన్ హౌస్ ఉన్న విషయం తెలిసిందే. ఆ కుటుంబానికి చెందిన చిత్రాలతో పాటు ఎంతో మందితో ఈ బ్యానర్‌పై సినిమాలు నిర్మించారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి మరో బ్యానర్ తీసుకురావాలని సమంత సంచలన నిర్ణయం తీసుకుందని తాజా సమాచారం.

అనుమానాలకు తావిస్తోన్న సమంత తీరు

అనుమానాలకు తావిస్తోన్న సమంత తీరు

నాగ చైతన్యతో కలిసి వ్యాపారం ప్రారంభించాలని సమంత భావిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రొడక్షన్ హౌస్ వార్త బయటకు వచ్చింది. దీంతో అక్కినేని ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు, అక్కినేని అభిమానులు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X