అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: సమంత సూపర్ ప్లాన్.. నాగ చైతన్యతో కలిసి త్వరలోనే ప్రకటన.!

By Manoj Kumar P

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం గోల్డెన్ డేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. కెరీర్ ఆరంభంలోనే అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ బ్యూటీ.. దాదాపు స్టార్ హీరోలందరితోనూ ఆడి పాడింది. అదే సమయంలో గ్లామర్ రోల్స్ కూడా చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుని రికార్డు క్రియేట్ చేసింది.

ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు అక్కినేని హీరో నాగ చైతన్యతో ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకుంది. తాజాగా సమంత తన భర్తతో కలిసి ఓ సూపర్ ప్లాన్‌ చేసిందని వార్త బయటకు వచ్చింది. ఇంతకీ దీని వెనుక కథ ఏంటి.? వివరాల్లోకి వెళితే...

 ఒక్కటి కాదు.. రెండు కాదు వరుసగా ఎన్నో

ఒక్కటి కాదు.. రెండు కాదు వరుసగా ఎన్నో

సమంత కొద్ది రోజులుగా వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది. త్రివిక్రమ్ - నితిన్ కాంబోలో వచ్చిన ‘అ ఆ' నుంచి ఆమె ‘జనతా గ్యారేజ్', ‘రంగస్థలం', ‘మహానటి', ‘యూటర్న్', ‘మజిలీ', ‘ఓ బేబీ' వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో తమిళంలోనూ ‘మెర్సల్', ‘ఇరుంబుతిరై', ‘సూపర్ డీలక్స్' వంటి హిట్ చిత్రాల్లో నటించింది.

ఒకటి పూర్తయింది.. మరొకటి మిగిలి ఉంది

ఒకటి పూర్తయింది.. మరొకటి మిగిలి ఉంది

ప్రస్తుతం సమంత నటిస్తున్న చిత్రాల విషయంలో క్లారిటీ లేదు. అయితే, తమిళ చిత్రం ‘96'కు రీమేక్‌గా వస్తున్న సినిమాలో శర్వానంద్ సరసన చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక, ఈ మధ్య ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సామ్.. ప్రస్తుతం దాని షూటింగ్‌లో పాల్గొంటోంది. ఇందులో ఆమె నెగెటివ్ రోల్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది.

అక్కడ ఫుల్ బిజీ.. అందుకే అంతమంది

అక్కడ ఫుల్ బిజీ.. అందుకే అంతమంది

సమంత సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండడం కోసం సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తన సినిమా కబుర్లతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలన ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. దీంతో ఆమెకు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ సహా మిగిలిన సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్ గణనీయంగా పెరిగిపోతున్నారు.

అవార్డు అందుకున్న సమంత

అవార్డు అందుకున్న సమంత

సమంత ఈ మధ్య చేసిన సినిమాలన్నీ తన పాత్రకు ప్రాధాన్యం ఉన్నవే అన్న విషయం తెలిసిందే. వీటిలో ముఖ్యంగా తమిళంలో వచ్చిన ‘సూపర్ డీలక్స్'లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఈ ప్రదర్శనకు గానూ ఆమె జీ సినీ అవార్డ్స్ ఫంక్షన్‌లో ఉత్తమ నటి (స్పెషల్ జ్యూరీ)గా ఎంపికైంది. ఈ ఫంక్షన్ శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది.

భర్తతో కలిసి సమంత సూపర్ ప్లాన్

భర్తతో కలిసి సమంత సూపర్ ప్లాన్

ప్రస్తుతం సినిమాలకు తాత్కాలికంగా దూరంగా ఉన్న సమంత అదిరిపోయే ప్లాన్ రెడీ చేసిందని తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. ఆమె తన భర్తతో కలిసి త్వరలోనే ఓ వ్యాపారాన్ని ప్రారంభించబోతుందట. అది దేనికి సంబంధించిన బిజినెస్ అనే విషయాన్ని త్వరలోనే భార్య భర్తలు ఇద్దరూ కలిసి అధికారికంగా ప్రకటించనున్నాని సమాచారం.

సూపర్ హిట్ పెయిర్.. సక్సెస్ అవుతుందా

సూపర్ హిట్ పెయిర్.. సక్సెస్ అవుతుందా

సమంత.. నాగ చైతన్య కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. వీరిద్దరూ ‘ఏమాయ చేశావే' చేసిన సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ‘మనం', ‘ఆటోనగర్ సూర్య', ‘మజిలీ' సినిమాల్లో కలిసి నటించారు. వీటిలో ఒకటి మినహా అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో వీరు చేయబోయే బిజినెస్ కూడా సక్సెస్ అవుతుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X