చైకి విడాకులు ఇవ్వు మనిద్దరం పెళ్లి చేసుకుందాం.. నెటిజన్ కామెంట్‌కు సమంత రిప్లై వైరల్
సమంత నెటిజన్లతో చేసే సంభాషణ, ఇచ్చే కౌంటర్ల గురించి అందరికీ తెలిసిందే. సమంత సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌కు అప్పుడప్పుడు రిప్లై ఇచ్చి ఉత్సాహ పరుస్తూ ఉంటుంది. అయితే సమంత రిప్లై ఇవ్వాలంటే కాస్త క్రియేటివిటీ వాడాలి. అది ఫోటో ఎడిటింగ్‌లొనైనా, కామెంట్‌లోనై కొత్తదనాన్ని చూపించాలి. అలా సమంత పెళ్లికి సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

సమంత ఫోటోను అలా..
సమంత పెళ్లి ఫోటోల్లోంచి ఓ ఫోటోను ఎడిట్ చేసిన ఓ అభిమాని.. ఏకంగా సమంతను పెళ్లి చేసుకున్నట్టుగా మార్పింగ్ చేసేశాడు. ఆ ఫోటో సమంత కంట పడటంతో అదిరిపోయే కామెంట్ చేసింది. ఈ పెళ్లి ఎప్పుడు జరిగింది? నాకు తెలియదు అంటూ కౌంటర్ వేయడంతో బాగా వైరల్ అయింది. మరోసారి అక్కినాని, దగ్గుబాటి ఫ్యామిలీతో ఎడిటి చేసిన పిక్ వైరల్ అయింది.

అందరి సమక్షంలో..
నాగార్జున, వెంకటేష్, అమల, అఖిల్‌తో పాటు అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీ సభ్యుల ఫోటోలను ఒక్క చోటకు తీసుకొచ్చి.. సమంత చైతన్యను దీవించినట్టుగా ఎడిట్ చేశాడు. ఆ ఫోటో బ్యాగ్రౌండ్‌లో అక్కినేని నాగేశ్వరరావు సతీసమేతంగా ఉన్నారు. అయితే ఈ ఫోటోను చూసిన సమంత వావ్.. మా పెళ్లి ఫోటో సో క్యూట్ అంటూ నెటిజన్ క్రియేటివిటీని మెచ్చుకుంది.

తాజాగా మరోసారి..
ఇలా నెటిజన్ల క్రియేటివిటీ, కామెంట్లకు స్పందిస్తూ సెటైర్లు, ప్రశంసలు అందిస్తూ ఉంటుంది. తాజాగా సమంత ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోకు ఓ నెటిజన్ వెరైటీ కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్‌కు సమంత అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. సమంత రిప్లైకి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

అది చాలా కష్టం..
‘చై కి విడాకులు ఇచ్చేయ్.. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం' అంటూ కామెంట్ చేశాడు. దీనికి స్పందించిన సమంత.. ‘కష్టం... ఒక పని చెయ్..చై ని అడుగు' అంటూ కౌంటర్ ఇచ్చింది. సమంత ఇచ్చిన రిప్లైకి నెటిజన్లు షాక్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











