Samanthaకు పూలంటే ఎలర్జీ.. శాకుంతలం గురించి ఎవరికీ తెలియని 5 క్రేజీ విషయాలు!
వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకుంది సమంత. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్, పుష్ప ఊ అంటావా మావా ఐటమ్ సాంగ్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ.
దీంతో ఆమెకు వరుస పెట్టి అటు బాలీవుడ్, ఇటు హాలీవుడ్ నుంచి అవకాశాలు రావడం మొదలైంది. గతేడాది యశోద మూవీతో హిట్ కొట్టిన ఈ బ్యూటి ప్రస్తుతం శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎవరికీ తెలియని ఐదు క్రేజీ థింగ్స్ ను ఓ వీడియో ద్వారా పంచుకుంది బ్యూటిఫుల్ సామ్.

ఊహించని విషయాలు: ఎపిక్ మైథాలాజికల్ మూవీగా వస్తున్న స్టార్ హీరోయిన్ సమంత శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రముఖ డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణా టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ నిర్మించారు.
ఈ సినిమాలో శాకుంతలం మేకోవర్, కాస్ట్యూమ్స్ అంతా దేవకన్యను మైమరిపించాయి. ఈ సినిమాలోని ఐదు ఆశ్చర్యకర, ఎవరూ ఊహించని విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ముద్దుగుమ్మ సమంత.
ఫ్లవర్ టాటూలా: బ్యూటిఫుల్ సమంత రూతు ప్రభుకు పూల ఎలర్జీ ఉందట. శాకుంతలం సినిమాలో సమంత ధరించిన పూల వలల మోచేతికి, మెడ మిగతా భాగాల్లో ర్యాషెస్ వచ్చాయని వీడియోలో తెలిపింది సామ్. ఆ ర్యాషెస్ ఒక ఫ్లవర్ టాటూలాగా కనిపించేదని, ఆరు నెలలపాటు అది అలాగే ఉండిపోయిందని చెప్పింది. అంతేకాకుండా షూటింగ్ లో అది కనిపించకుండా ఉండేందుకు దానిపై మేకప్ చేసినట్లు కూడా వెల్లడించింది.

డబ్బింగ్: పాన్ ఇండియాగా వస్తున్న శాకుంతలం సినిమాను తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకోసం సమంత ఏకంగా మూడు భాషల్లో సొంతంగా తానే డబ్బింగ్ చెప్పిందట. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తానే డబ్బింగ్ చెప్పినట్లు, అలా వేర్వేరు భాషల్లో డైలాగ్స్ పలకడం చాలా కష్టమైన పని, మిగతా వారు ఎలా చేస్తున్నారో అని సామ్ చెప్పుకొచ్చింది.
కుందేళ్లు క్యూట్ కాదు: మెలోడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందిస్తున్న శాకుంతలం సినిమా షూటింగ్ సెట్ లో ఓ కుందేలు ముద్దుగుమ్మ సమంతను కరిచిందట. కుందేళ్లు అస్సలు క్యూట్ గా అనిపించలేదని, అవి తనను కరిచాయని అని తనదైన స్టైల్ లో క్యూట్ గా చెప్పుకొచ్చింది బ్యూటిఫుల్ సమంత.

దానివల్ల తిట్లు తిన్నా: శాకుంతలం సినిమా కోసం తాను 30 కేజీల బరువున్న లెహెంగా వేసుకున్నట్లు సామ్ చెప్పుకొచ్చింది. ఇంత బరువున్న లెహంగాలో నటించడం చాలా కష్టమైందని, చుట్టూ తిరిగినప్పుడల్లా దాని బరువుకు షాట్ ఫ్రేమ్ నుంచి పక్కకు తప్పుకున్నట్లు తెలిపింది. దీంతో రాజు మాస్టర్ చేతిలో సరిగ్గా చేయలేవా అంటూ తిట్లు తినాల్సి వచ్చిందని సామ్ తెలిపింది. 'సర్ నేను సరిగ్గానే ఉన్నా అదే నన్ను లాక్కెళ్తుంది' అంటూ క్యూట్ గా సామ్ చెప్పింది.
నా హెయిర్ కాదు: 30 కేజీల బరువైన లెహెంగాతో సుమారు 10, 15 టేక్స్ తీసుకోవాల్సి వచ్చిందని సమంత వెల్లడించింది. ఇక ఐదో క్రేజీ థింగ్ అంటూ షాకింగ్ విషయం చెప్పింది. దీన్ని ఎవరు అస్సలు ఊహించలేరంటూ ఈ శాకుంతలం సినిమాలో కనిపించే జుట్టు తన ఒరిజినల్ హెయిర్ కాదని చెప్పి క్యూట్ నవ్వేసింది. ఇవి శాకుంతలం క్రేజీ థింగ్స్.. గుర్తు పెట్టుకుంటారో లేదో మీ ఇష్టం అంటూ వీడియోను ఎండ్ చేసింది.


Click it and Unblock the Notifications











