For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Samantha జీవితంలో ఎవరూ పర్‌ఫెక్ట్ కాదు.. సమస్య ఎదురైతే ఎవరికి లొంగకూడదు.. సమంత

  |

  అక్కినేని నట వారసుడు నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత రుత్ ప్రభు మీడియాలో భావోద్వేగంగాను, ఆచీతూచీ మాట్లాడుతున్నారు. మీడియాకు దూరంగా ఉంటూనే ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా నర్మగర్భంగా తన భావాలను వెల్లడిస్తున్నారు. జీవితంలో భారీ షాక్ నుంచి త్వరగా తేరుకోవడమే కాకుండా కెరీర్‌ను కూడా చక్కబెట్టేసుకొంటున్నది. తాజాగా రోషిణి ట్రస్ట్, దాట్ల ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన సైక్రియాటరి ఎట్ యువర్ డోర్‌స్టెప్ అనే కార్యక్రమంలో సమంత పాల్గొన్నారు. ఈ సమావేశంలో తాను క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డానననే విషయం గురించి సమంత మాట్లాడుతూ..

  మానసికంగా ధృడంగా ఉండాలి

  మానసికంగా ధృడంగా ఉండాలి

  సోషల్ మీడియా బలంగా ఉన్న సమాజంలో పరిస్థితులను ఎదుర్కోవాలంటే చాలా కష్టం. జీవితంలో ఎవరూ పర్‌ఫెక్ట్ కాదు. కానీ సోషల్ మీడియాలో ఫర్‌ఫెక్ట్‌గా ఉండాల్సిన ఒత్తిడి ఏర్పడుతుంది. అందుకోసం మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒత్తిడితో కూడిన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా మానసికంగా ధృడంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అని సమంత అన్నారు.

  బలహీనతల గురించి మాట్లాడటం

  బలహీనతల గురించి మాట్లాడటం


  రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతున్న ప్రపంచంలో జీవిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మన బలహీనతల గురించి మాట్లాడటం చాలా కష్టంగా మారుతున్నది. మానసికంగా బాధ కానీ, ఆందోళన గురించి కానీ.. మాట్లాడాలంటే చాలా ఫోకస్ ఉండాలి. సోషల్ మీడియాలో ఉన్న తనకు జీవితంలో ఫర్‌ఫెక్ట్‌గా ఉండాలంటే చాలా కష్టం. ఇది అనుభవంతో చెబుతున్న మాటలు ఇవి. కాబట్టి మీరు నమ్మాల్సిందే అని సమంత చెప్పుకొచ్చారు.

  మెరుపులు, గ్లామర్ గురించి మాత్రమే కాదు

  మెరుపులు, గ్లామర్ గురించి మాత్రమే కాదు

  ఒక సెలబ్రిటీగా నా జీవితంలోని మెరుపులు, గ్లామర్ గురించి మాత్రమే కాదు.. బాధలు, కష్టాలు, సమస్యల గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. జీవితానికి సవాల్ విసిరే ఎన్నో సమస్యలు ప్రతీ మనిషికి ఎదురవుతాయి. వాటి గురించి కూడా సాధారణంగానే మాట్లాడుకోవాలి. సమస్యల్లో ఉన్నప్పుడు ఎదుటి వారి నుంచి సహాయం కోరుకోవాల్సిందే అని సమంత చెప్పారు.

  స్నేహితులు, మానసిక నిపుణులు సహయాన్ని

  స్నేహితులు, మానసిక నిపుణులు సహయాన్ని


  జీవితంలో ఒంటరిగా ఎద్కుర్కోలేని సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు అని తన జీవితంలో జరిగిన భారీ కుదుపు గురించి సమంత పరోక్షంగా చెప్పుకొనే ప్రయత్నం చేసింది. నా జీవితం అతిపెద్ద ప్రశ్నగా మారినప్పుడు నా స్నేహితులు, మానసిక నిపుణులు సహయాన్ని ఆర్థించాను. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకొని ఉపశమనం పొందాను. అందుకే ఇప్పుడు మీ ముందు ఇలా ధైర్యంగా కూర్చోగలిగాను. మీతో మాట్లాడే స్థైర్యం లభించింది అని సమంత చెప్పారు.

  ఏ పరిస్థితుల్లోను లొంగకూడదు

  ఏ పరిస్థితుల్లోను లొంగకూడదు

  జీవితంలో ప్రతీ మనిషికి సమస్యలు ఎదురవుతాయి. కానీ వాటికి ఏ పరిస్థితుల్లోను లొంగకూడదు. ఆ సమయంలోనే స్నేహితులు, మానసిక నిపుణుల సహాయంతో బలాన్ని కూడగట్టుకోవాలి. నేను సమస్యల్లో ఉన్నప్పుడు చాలా మంది నేను మరింత బలంగా, ధృడంగా మారేందుకు సహాయ పడ్డారు అని సమంత ఎమోషనల్ అయ్యారు.

  Pushpa లో Samantha ఐటెం సాంగ్.. కండిషన్స్ అప్లై..! || Filmibeat Telugu
  సమంత సినీ కెరీర్ విషయానికి వస్తే..

  సమంత సినీ కెరీర్ విషయానికి వస్తే..

  ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత సమంత రుత్ ప్రభు క్రేజ్ ప్యాన్ ఇండియా స్థాయికి చేరుకొన్నది. శాకుంతలం, తమిళంలో కాతువాకుల రెండు కాదల్ చిత్రాలను రిలీజ్‌కు సిద్దం చేస్తూనే మరో భారీ, విభిన్నమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రతిష్టాత్మక శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ రూపొందిస్తున్న యశోద చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఇటీవల రిలీజైన పుష్ప చిత్రంలో అల్లు అర్జున్‌తో కలిసి ఓ స్పెషల్ పాటలో నర్తించి మెప్పించింది.

  English summary
  Samantha Ruth Prabhu about Mental Weeknesses. She participated in an event to launch the Psychiatry At Your Doorstep initiative of Roshini Trust and Datla Foundation,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X