For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Samantha: సమంత బాడీపై చైతూ గుర్తు.. నెటిజన్ ఊహించని ప్రశ్న.. మీరు కూడా ఆ తప్పు చేయొద్దంటూ!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తోంది టాలెంటెడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు. 'ఏమాయ చేశావే' సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ.. తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. గత ఏడాదే అతడితో సామ్ విడిపోయింది.

  ఈ నేపథ్యంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన చిట్ చాట్ సెషన్‌లో తన బాడీపై ఉన్న టాటూల గురించి సమం షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

  టాలీవుడ్ నుంచి నేషనల్ రేంజ్

  టాలీవుడ్ నుంచి నేషనల్ రేంజ్

  టాలీవుడ్‌లో వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న సమంత చాలా కాలంగా యమ సందడి చేస్తోంది. ఇప్పటికే దాదాపు అందరు హీరోలతోనూ ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ చాలా కాలంగా హవాను చూపిస్తోంది. ఇక, ఈ మధ్య కాలంలో 'ద ప్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ద్వారా దేశ వ్యాప్తంగా తనను తాను పరిచయం చేసుకుంది. దీంతో ఆమె క్రేజ్‌ నేషనల్ రేంజ్‌కు పెరిగిపోయింది.

  Pooja Hegde: పూజా హెగ్డే అందాల జాతర.. ఉల్లిపొరలాంటి బట్టల్లో యమ హాట్‌‌గా!

  ఆ మూవీలతో సామ్ ఫుల్ బిజీగా

  ఆ మూవీలతో సామ్ ఫుల్ బిజీగా

  సమంత ఇప్పటికే తెలుగులో 'శాకుంతలం' అనే సినిమాను పూర్తి చేసుకుంది. దీనితో పాటు 'కాతు వాకుల్ రెండు కాదల్' అనే తమిళ చిత్రాన్ని కంప్లీట్ చేసేసుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ హీరోయిన్ 'యశోద' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. అలాగే, ఫిలిప్ జాన్ తెరకెక్కించే 'The arrangements of love' అనే ఇంగ్లీష్ ఫిల్మ్‌లోనూ నటిస్తుంది.

  విడాకుల తర్వాత ఫుల్ స్పీడ్‌గా

  విడాకుల తర్వాత ఫుల్ స్పీడ్‌గా

  కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సమంత పర్సనల్ లైఫ్‌లో మాత్రం పెద్ద ఎదురుదెబ్బను తగిలించుకుంది. గతంలో ఆమె అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్ల పాటు అతడితో అన్యోన్యంగా గడిపిన సామ్.. గత ఏడాది అక్టోబర్‌లో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి కెరీర్‌పై ఫోకస్ చేస్తూ యమ స్పీడుగా దూసుకెళ్తోంది.

  ప్రియుడితో ఏకాంతంగా నయనతార: ఒకే రూమ్‌లో క్లోజ్‌గా.. పర్సనల్ పిక్ బయటకు రావడంతో!

   టాటూ పిచ్చి.. చైతూ గుర్తుగానూ

  టాటూ పిచ్చి.. చైతూ గుర్తుగానూ

  స్టార్ హీరోయిన్ సమంతకు టాటూలు అంటే ఎంతో ఇష్టం అన్న విషయం తెలిసిందే. ఆమె బాడీపై ఇప్పుటికే మూడు టాటూలను కూడా వేయించుకుంది. అందులో ఒకటి మెడ మీద ఉంటుంది. మరొకటి చేతి మీద వేయించుకుంది. ఇంకోటి అయితే ఎద భాగం కింద రాయించుకుంది. ఇది మాత్రం చైతూ గుర్తుగా అతడి పేరుతో వేసుకుంది. ఇప్పటికే వీటిని చూపిస్తూ ఫొటోలు వదిలింది.

  సోషల్ మీడియాలో యమ బిజీ

  సోషల్ మీడియాలో యమ బిజీ

  చేతి నిండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయిన సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా కాలంగా ఫుల్ బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఇప్పటికే సామ్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

  మళ్లీ రెచ్చిపోయిన దిశా పటానీ: ఈ సారి బట్లలేమీ లేకుండానే యమ ఘాటుగా!

  టాటూల గురించి సామ్‌కు ప్రశ్న

  టాటూల గురించి సామ్‌కు ప్రశ్న

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే స్టార్ హీరోయిన్ సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్లతో చిట్ చాట్ సెషన్ నిర్వహించింది. ఇందులో వాళ్లు అడిగిన ఎన్నో ప్రశ్నలకు విసుగు లేకుండా సమాధానం చెప్పింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ 'మీరు ఎప్పటికైనా వేసుకోవాలనుకున్న టాటూలు ఏంటో చెప్పండి' అని సూటిగా ప్రశ్నించారు.

  ఊహించని రిప్లై ఇచ్చిన బ్యూటీ

  ఊహించని రిప్లై ఇచ్చిన బ్యూటీ

  సదరు నెటిజన్ టాటూల గురించి ప్రశ్నించగానే సమంత 'నేనసలు టాటూలే వేయించుకోకూడదని అనుకుంటున్నాను. అలాంటి ఆలోచన మీక్కూడా ఉంటే తక్షణమే మానుకోండి' అంటూ సూచించింది. దీంతో అప్పట్లో టాటూలంటే పడి చచ్చిపోయే సామ్.. ఇప్పుడిలా అనేసిందేంటి అనుకుంటున్నారు. అలాగే, పాత టాటూలను ఏం చేసిందా అని చర్చించుకుంటున్నారు.

  English summary
  Tollywood Couple Samantha and Naga Chaitanya Recently Separated. Now She Gave Clarity on Her Body Tattoos in Instagram Session.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X