వాటితో బద్దకంగా తయారవుతాను.. ద్వేషించే వారిపై సమంత కౌంటర్
సౌత్ లేడీ సూపర్ స్టార్ సమంత.. ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ స్టార్ హీరోయిన్లుకు ధీటుగా నిలబడుతోంది. కోలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా దుమ్ములేపుతోంది. సమంత మాత్రం నిన్నటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. పూజా హెగ్డే చేసిన కామెంట్స్, సమంత పరోక్ష రిప్లై, డైరెక్టర్ నందినీ రెడ్డి, చిన్మయి శ్రీపాద ఎంటర్వడం ఓ రేంజ్‌లో వైరల్ అయింది. అయితే తాజాగా సమంత నెటిజన్లతో ముచ్చటిస్తూ అనేక విషయాలపై స్పందించింది. అవేంటో ఓ సారి చూద్దాం.
కోపానికి పోయి కుంపటిలో కాలు పెట్టిన పూజా హెగ్డే.. డోస్ పెంచుతున్న సమంత ఫ్యాన్స్!

ఫిట్‌నెస్ రహస్యం..
ఫిట్‌నెస్ రహస్యం ఏంటని సమంతను ప్రశ్నిస్తే.. నేను రోజు తప్పి రోజు బిర్యానీ తింటానని, పచ్చడి కూడా తెగ తింటానని, మసాలా ఐటెమ్స్ ఫుల్లుగా లాగిస్తానని చెప్పుకొచ్చింది. దీన్ని బట్టే తన ఫిట్ నెస్ రహస్యాలు అర్థం చేసుకోండని తెలిపింది.

సెలెబ్రిటీలపై..
గోంగూర పచ్చడి తింటున్నారా? అని అంటే.. అవును తింటున్నాను వాటిని తమ తోటలోనే పెంచుతున్నానని తెలిపింది. రోజుకు రెండు మామిడి పండ్లు కూడా తింటున్నానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అమల, నాగచైతన్య,అఖిల్, రష్మీక ఇలా సెలెబ్రిటీలందరిపైనా కామెంట్ చేసింది.

ప్రస్తుతం చెలరేగిన వివాదం..
పూజా హెగ్డే సమంత మధ్య జరుగుతున్న వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమంత ఏమీ అంత అందంగా లేదని పూజా హెగ్డే కామెంట్ చేయడం, అనంతరం తన అకౌంట్ హ్యాక్ అయిందని ప్రకటించడం అందరికీ తెలిసిందే. దీంతో సమంత ఫ్యాన్స్ పూజాపై విపరీతమైన ట్రోలింగ్ చేశారు.
Recommended Video

ద్వేషించే వారిపై కౌంటర్..
తాజాగా సమంతకు ఓ ప్రశ్న ఎదురైంది. నిన్ను ద్వేషించే వారి గురించి ఏం చెబుతారని సమంతను ప్రశ్నిస్తే.. ‘వారే నాకు స్ఫూర్తి.. మాములుగా పొగడ్తలతో నేను బద్దకస్తురాలిగా తయారవుతాను.. నన్ను తిట్టే వారి వల్లే నాలోని పనితనాన్ని మెరుగు పరుచుకుంటాన'ని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











