వైరల్ పిక్స్ : చార్మినార్‌పై ఆసనం.. స్పైడర్ మ్యాన్‌లా మారిన సమంత!
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పలేం. ఏదైనా ఓ సంఘటన, ఇంకా ఏదైనా ఓ సెలెబ్రిటీ ఫోటో అప్పుడప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వాటిపై రకరకాల ప్రయోగాలు చేయబడుతుంటాయి. ఇక మీమ్స్ క్రియేట్స్ చేసేవారికి అలాంటి స్పెషల్ పిక్స్ దొరికితే వాటితో ఓ ఆట ఆడేసుకుంటారు. ఆ మధ్య విజయ్ దేవరకొండ ఫోటోను నానా రకాలు వాడి రచ్చ చేశారు. ప్రస్తుతం అలాంటి ఓ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సమంత గాల్లో తేలినట్టుగా వేసిన ఆసనాన్ని చిత్ర విచిత్రాలుగా వాడుతున్నారు. వాటి సంగతేంటో ఓ సారి చూద్దాం.

బిజిబిజీగా సమంత..
సమంత ప్రస్తుతం బిజీ బిజీగా గడిపేస్తోంది. ఖాళీగా దొరికిన ఈ సమయాన్ని ఎంతో చక్కగా వినియోగించుకుంటోంది. ఫిట్‌నెస్, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టింది. అందులో భాగంగా ఇంటిపై భాగానే అర్బన్ ఫార్మింగ్ చేస్తోంది. సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తూ పంటను పండిస్తోంది. రసాయనాలు ఉపయోగించని కూరగాయలతో వంటలు కూడా వండుతోంది.

ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి..
సమంతకు ఫిట్‌నెస్‌పై ఎప్పటినుంచి ప్రత్యేక దృష్టి సారిస్తూనే ఉంది. ఒకప్పుడు జిమ్‌లో బరువులెత్తుతూ కొవ్వును కరిగించేది. వంద కేజీల బరువును కూడా సునాయసంగా ఎత్తి అవతల పారేసేది. భర్తతో సరి సమానంగా జిమ్‌లో పోటీ పడేది. అయితే ప్రస్తుతం యోగాతో తన ఫిట్‌నెస్‌ను మరింత పెంచుకుంటోంది.

ఆసనాల్లో ఆరితేరి..
సమంత ప్రస్తుతం యోగా నేర్చుకుంటోంది. కఠినాతి కఠినమైన ఆసనాలను కూడా అవలీలగా వేసేస్తోంది. అందులో భాగంగా ఈ మధ్య వేసిన ఓ ఆసనం సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. చేతుల సాయంతోనే గాల్లో ఆసనం వేసింది సమంత. చేతులపైనా శరీర భారాన్నంత మోసి వావ్ అనిపించింది. ఆ ఆసనానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో సునామినీ సృష్టించింది.
Recommended Video

రకరకాల మీమ్స్..
అంతలా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ ఫోటోపై లెక్కలేనన్ని మీమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఛార్మినార్, కర్నూలు కొండారెడ్డి బుర్జు సెంటర్‌పై, పిల్లవాడి వీపుపై సమంత ఆసనం వేసినట్టుగా మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా సమంత స్పైడర్ మ్యాన్‌లా మారిపోయినట్టుగా ఓ మీమ్ తెగ వైరల్ అవుతోంది. వీటిపై సమంత స్పందిస్తూ.. ఎదుటి వారిని చూసి నవ్వినప్పుడు మనల్ని మనం చూసుకుని నవ్వేంత శక్తి ఉండాలని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











