ఆ నటి కొడుకుతో అలా.. ఫొటో కోసం వచ్చి ఆ మాట: చెల్లిని మోసం చేశానంటూ సమీరా షాకింగ్ కామెంట్స్

సినిమాల్లో నటించే వాళ్ల కంటే సీరియళ్లలో చేసే వాళ్లకు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మరింత ఎక్కువ గుర్తింపు వస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి కారణం ఆ నటీనటులను ప్రేక్షకులు తమ ఇంటి వాళ్లుగా భావిస్తుండడమే. ఈ జాబితాలో చాలా మంది నటీమణులు ఉన్నారు. అందులో బుల్లితెర సీరియల్ హీరోయిన్ సమీరా షరీఫ్ ఒకరు. చాలా కాలం నుంచి తెలుగు వాళ్లను అలరిస్తోన్న ఆమె.. కామెడీ షోలోనూ యాంకరింగ్ చేసి మెప్పించింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

‘ఆడపిల్ల'లా వచ్చి.. పాపులర్ అయింది

‘ఆడపిల్ల'లా వచ్చి.. పాపులర్ అయింది

సమీరా షరీష్ 2006లోనే తెలుగు టీవీ రంగంలోకి అడుగు పెట్టింది. ప్రముఖ చానెళ్లలో ప్రసారం అయిన 'ఆడపిల్ల' అనే సీరియల్ ద్వారా ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం అయిన ఆమె.. ఆ తర్వాత 'అభిషేకం', 'భార్యమణి', 'మూడు ముళ్ల బంధం', 'ప్రతిబింబం', 'మంగమ్మ గారి మనవరాలు'తో పాటు పలు తమిళ సీరియళ్లలోనూ నటించింది. దీంతో నటిగా ఆమె మంచి గుర్తింపును తెచ్చుకుంది.

అప్పటి నుంచి దూరమైంది.. అక్కడలా

అప్పటి నుంచి దూరమైంది.. అక్కడలా

ఒకప్పుడు వరుస సీరియళ్లతో ఫుల్ బిజీగా గడిపిన సమీరా షరీఫ్.. కొన్నేళ్లుగా తెలుగు బుల్లితెరపై కనిపించడం లేదు. 2016లో వచ్చిన 'మంగమ్మ గారి మనవరాలు' తర్వాత ఆమె మరో సీరియల్‌లో నటించలేదు. కానీ, తమిళంలో మాత్రం ఒకేసారి పలు ధారావాహికల్లో నటిస్తూ మెప్పిస్తోంది. ఇక, ఇటీవలే తెలుగులో 'అరవింద సమేత' అనే దానిని మొదలెట్టిందామె.

అర్ధనగ్నంగా కుర్ర హీరోయిన్.. ఎదకు పూలను అడ్డం పెట్టుకొంటూ..

యాక్టర్ గ్యాప్ తీసుకుని... యాంకర్‌గా

యాక్టర్ గ్యాప్ తీసుకుని... యాంకర్‌గా

జబర్ధస్త్ షోకు గుడ్ బై చెప్పిన తర్వాత మెగా బ్రదర్ నాగబాబు మరో చానెల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో 'అదిరింది' అనే కామెడీ షోనూ ప్రారంభించారు. చమ్మక్ చంద్ర, వేణు, ధన్‌రాజ్, కిర్రాక్ ఆర్పీ, సద్దాం టీమ్ లీడర్లుగా వ్యవహరించిన ఈ షో ద్వారా యాక్టర్ సమీరా షరీఫ్ యాంకర్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత ఆమెను షో నుంచి తప్పించారు.

సినీ నటి కొడుకుతో సమీరా షరీఫ్ పెళ్లి

సినీ నటి కొడుకుతో సమీరా షరీఫ్ పెళ్లి

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలో సినీ నటి సన కుమారుడు... సీరియల్ హీరో అయిన సయ్యద్ అన్వర్ అహ్మద్‌ను వివాహం చేసుకుంది సమీరా షరీఫ్. పెళ్లి తర్వాత కొంత స్పీడు తగ్గించిన ఈ అమ్మడు.. భర్త సహాయంతో యూట్యూబ్‌లో మాత్రం వీడియోలు చేస్తోంది. అలాగే, సెలెక్టివ్‌గా ప్రాజెక్టులను ఓకే చేస్తోంది. అన్వర్ మాత్రం తమిళంలో వరుసగా సీరియళ్లు చేస్తున్నాడు.

చెల్లిని మోసం చేశానంటూ రివీల్ చేసింది

చెల్లిని మోసం చేశానంటూ రివీల్ చేసింది

భర్త అన్వర్‌తో కలిసి సమీరా షరీఫ్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలు వెల్లడించింది. 'మా అక్క లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్లిపోవడంతో చెల్లి పెళ్లి బాధ్యత నాపై పడింది. తన కోసం అన్వర్‌తో మాట్లాడడం ప్రారంభించాను. అయితే, చెల్లి కాకుండా నేను అతడిని పెళ్లి చేసుకున్నా' అంటూ చెప్పుకొచ్చింది.

ఫొటో అడిగాడు.. ఆమెకు ఫోన్ చేశాను

ఫొటో అడిగాడు.. ఆమెకు ఫోన్ చేశాను

తన భర్తతో మొదటి పరిచయం గురించి చెబుతూ.. 'ఓ రోజు నేను షాపింగ్ మాల్‌లో ఉన్న సమయంలో అన్వర్ అక్కడికి వచ్చాడు. సమీరా అంటూ పిలిచి ఓ ఫొటో అడిగాడు. ఆ తర్వాత వెళ్లేప్పుడు నేను యాక్టర్ సన గారి కొడుకును అని చెప్పాడు. అప్పుడు కాసేపు అతడితో మాట్లాడాను. ఆ తర్వాత ఈ విషయాన్ని ఆమెకు ఫోన్ చేసి చెప్పాను' అంటూ చెప్పుకొచ్చింది సమీరా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X