For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫ్లాష్‌బ్యాక్ : సంపూర్ణేష్ బాబుకు ఆ మాజీ ఎమ్మెల్యేకు సంబంధం.. ఫైవ్ స్టార్ హోటల్‌లో అలా!!

  |

  బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుకు ఉండే క్రేజే వేరు. వెండితెరపై సంపూ కనబడితే చాలు ప్రేక్షకుల్లో తెలియని ఓ ఉత్సాహం. ప్రత్యేక పాత్రలు చేసినా సంపూ తనదైన ముద్రను వేస్తాడు. మొదటి సినిమా హృదయ కాలేయంతోనే టాలీవుడ్‌ను తనవైపుకు తిప్పుకున్నాడు. ముఖ్యంగా చిన్న పిల్లల సంపూ పాపులారీటీయే వేరు. అయితే సంపూర్ణేష్ బాబుకు ఓ మాజీ ఎమ్మెల్యేతో ఎనలేని బంధం ఏర్పడింది. అది ఏనాటి బంధమో గానీ ఆయన్ను ఎప్పటికీ మరిచిపోలేనని సంపూ చెప్పుకుంటాడు. ఆయన గురించి ఓ ఇంటర్వ్యూలో సంపూ చెప్పిన సంగతులేంటోఓ సారి చూద్దాం.

  మాజీ ఎమ్మెల్యే ఫోన్..

  మాజీ ఎమ్మెల్యే ఫోన్..

  సంపూర్ణేష్ బాబుకు ఓ సారి ఓ ఫోన్ కాల్ వచ్చిందంటా. ఎవరని అడిగితే గుంటూరు మాజీ ఎమ్మెల్యేనని బదులిచ్చాడట. ఒకసారి కలవాలి వస్తావా? అని సంపూని అడిగితే.. తాను ఇప్పుడు తన సొంతూరు సిద్దిపేటకు వెళ్తున్నానని చెప్పాడట. ఓ రెండు మూడు రోజుల తరువాత వస్తానని చెప్పాడట. ఎందుకైనా మంచిదేనని ఆ నంబర్‌ను ఎక్స్ ఎమ్మెల్యే పేరిట సేవ్ చేసుకున్నాడట.

  మళ్లీ ఫోన్..

  మళ్లీ ఫోన్..

  ఎమ్మెల్యేతో తనకు ఏం పని ఉంటుంది.. మళ్లీ చేయడని అనుకుంటున్న సమయంలో ఫోన్ వచ్చిందని తెలిపాడు. అప్పుడు తాను అన్నపూర్ణ స్టూడియో‌లో సెట్‌లో ఉన్నానని పేర్కొన్నాడు. కలవాలని ఉందని చెప్పి ఓ కారును పంపించినట్టు వెల్లడించాడు. కాస్త భయంగా అనిపించడంతో పక్కనే ఉన్న తన ఫ్రెండ్‌తో విషయం చెప్పాడట.

  జాగ్వార్ కార్ చూసి షాక్..

  జాగ్వార్ కార్ చూసి షాక్..

  అలా తన ఫ్రెండ్ కూడా తనతో వస్తాననడంతో హ్యాపీగా ఫీలయ్యానని చెప్పాడు. అయితే బయటకు వచ్చి చూస్తే ఓ పెద్ద జాగ్వార్ కార్ ఉందని, ఆ కారును చూసి తన ఫ్రెండ్ షాక్ అయినట్టు చెప్పుకొచ్చాడు. ఆ కారులో ఇద్దరం ఆ మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లామని తెలిపాడు.

  రెండు లక్షల చెక్..

  రెండు లక్షల చెక్..

  ఇంటికి వెళ్లాక సరదాగా మాట్లాడుకున్నామని, తన ప్రాజెక్ట్‌ల గురించి అడిగినట్టు తొందరగా సినిమా చేయండని, ఎంతో ఎదురుచూస్తున్నట్టుగా ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పాడట. వారి ఇంట్లోనే భోజనం చేశారట.. అయితే వెళ్లే ముందు రెండు లక్షల రూపాయల చెక్ ఇచ్చారని, ఊరికే అవసరానికి వాడుకోండని చెప్పినట్టుగా తెలిపాడు.

  ఫైవ్ స్టార్ హోటల్‌లో అలా..

  ఫైవ్ స్టార్ హోటల్‌లో అలా..

  ఒకసారి అతను ఫోన్ చేసి సంపూను గుంటూరు రమ్మని చెప్పాడట. వెంటనే కారును, డ్రైవర్‌ను కూడా పంపాడట. ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో సంపూకు బస ఏర్పాటు చేశారట. ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు వెళ్లడం అదే మొదటి సారట.. అందులో ఏసీ ఎలా ఆఫ్ చేయాలో కూడా తెలీదట.. ఆ రాత్రంతా చలికి వణుకుతూ కింద పడుకున్నాడట.

  #SarkaruVaariPaata: Kichcha Sudeep To Play Key Role In Mahesh Babu's Movie | Filmibeat Telugu
  ఇప్పటికీ అలానే..

  ఇప్పటికీ అలానే..

  అలా ఆ మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లాక వారి ఫ్యాక్టరీలు, పొలాలు, తోటలు అన్ని చూపించారట. ఇక దుర్గమ్మ దర్శనం కోసం వెళ్తానని సంపూ అంటే రేంజ్ రోవర్ కారు ఇచ్చి పంపించాడట. ఇప్పటికీ ఆయన ఫోన్ చేస్తూనే ఉంటారట, ఏదైనా ఆర్థికంగా సమస్యలుంటే ఆయనే సాయం చేస్తారని సంపూ చెప్పుకొచ్చాడు.

  English summary
  Sampoornesh babu About Guntur Ex MLA. Guntur Ex MLA Helps Several Time To Sampoornesh babu. he says that Ex MLA Always supports In Financial Problems.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X