మా జీవితంలో ఇది ముఖ్యమైన రోజు.. సందీప్ రెడ్డి వంగా ఎమోషనల్

ఒక్క సినిమా ఎందరో జీవితాల్ని మార్చేస్తుంది. కొందరిని ఎవరెస్ట్ అంత పైకి ఎత్తితే.. అదే సినిమా పాతాళానికి కూడా పడేస్తుంది. అర్జున్ రెడ్డి అనే సినిమా హీరో విజయ్ దేవరకొండను, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను ఎవరెస్ట్‌పై నిల్చోబెట్టింది. అర్జున్ రెడ్డి అనేది టాలీవుడ్ గతిని తిప్పిన సినిమా. బాలీవుడ్ సైతం ఔరా అని నోరెళ్లబెట్టి చూసేలా చేసింది. మన అర్జున్ రెడ్డిపై, దాని మేకింగ్‌పై మనసు పారేసుకున్నారు.

అర్జున్ రెడ్డి సినిమా ఎన్ని వివాదాలను సృష్టించినా.. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాపై ఎంత మంది ఎన్నిరకాలు విమర్శలు చేసినా దేశ స్థాయిలోనూ దుమ్ములేపింది. అర్జున్ రెడ్డి విజయాన్ని చూసిన బాలీవుడ్.. సందీప్ రెడ్డి వంగాను అక్కడికి తీసుకెళ్లింది. షాహిద్ కపూర్‌తో కబీర్ సింగ్‌గా తెరకెక్కించి కనక వర్షాన్ని కురిపించాడు. ఇక నేటికి అర్జున్ రెడ్డి విడుదలై మూడేళ్లు పూర్తి కావడంతో సందీప్ రెడ్డి ఎమోషనల్ అయ్యాడు.

 sandeep reddy vanga emotional on 3 Years Of Arjun Reddy

అర్జున్ రెడ్డికి మూడేళ్లు.. మా జీవితాల్లో ఎంతో ముఖ్యమైన రోజు.. మేఘాలు గుద్దుకున్నప్పుడు వచ్చే మెరుపు కాంతిలా మెరిశాము.. మనసు పులకరించి ఏదో చిన్నగా వర్ణించాను.. మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు.. అంటూ సందీప్ రెడ్డి వంగా ట్వీట్ చేశారు. ఇక సందీప్ చేసిన ట్వీట్‌కు విజయ్ రిప్లై ఇచ్చాడు. మళ్లీ మనం కలుసుకునేంత వరకు అని పేర్కొన్నాడు. ఇక సందీప్ తెలుగులో రెండో ప్రాజెక్ట్‌పై నిత్యం ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. సందీప్ రెండో ప్రాజెక్ట్‌ మహేష్ బాబు, రామ్ చరణ్‌లతో ఉండోబోతోందని వార్తలు వస్తున్నాయి. కానీ మహేష్ బాబు డైరీ మాత్రం ఖాళీగా లేదు. మరి రామ్ చరణ్‌తో ఉండబోతుందా? లేదా ఇంకా ఎవరితోనైనా చేస్తాడా? అన్నది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X