For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుశాంత్‌ని నువ్ మాత్రమే బతికించేదానివి..అతడికి భార్య,తల్లి అన్నీ నువ్వే, కంటతడి పెట్టిస్తున్న పోస్ట్

  |

  సుశాంత్ సింగ్ మరణం (జూన్ 14) సంభవించి ఇప్పటికీ ఆరు రోజులు అవుతోంది. అయితే ఈ విషయాన్ని కొందరు మాత్రం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. కారణం సుశాంత్‌కు ఉన్న మంచి మనసు. ఎంతో ప్రతిభ,భవిష్యత్తు ఉన్న సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటం అందర్నీ కలిచి వేసింది. సుశాంత్‌ అంకిత లోఖండే, కృతి సనన్, రియా చక్రవర్తిలతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. అయితే అంకితతో మాత్రం ఆరేళ్లుగా ప్రేమలో మునిగాడు. ప్రముఖ సీరియల్ పవిత్ర రిష్తా సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆపై ఈ ఇద్దరు విడిపోయారు.

  Sushant Could Be Saved By Ankita Lokhande, Ankita ఇంటి నేమ్‌ ప్లేట్ మీద ఇప్పటికీ Sushant పేరు
  మనం అతడిని ఆపాల్సింది..

  మనం అతడిని ఆపాల్సింది..

  సుశాంత్-అంకిత ప్రేమలో ఉన్నప్పుడు వారిద్దరితో పాటు సందీప్ సింగ్ అనే మరో నటుడు కూడా ఉండేవాడు.ఈ ముగ్గురు ప్రాణ స్నేహితులు. తాజాగా సుశాంత్ మరణాన్ని జీర్ణించుకోలేని సందీప్ సోషల్ మీడియాలో స్పందించాడు. ‘ప్రియమైన అంకిత, ప్రతి రోజు గడిచేకొద్దీ, ఒక ఆలోచన నన్ను పదే పదే వెంటాడుతూనే ఉంటుంది. మనం ఇంకా గట్టినా ప్రయత్నించాల్సి ఉంది.. మనం అతడిని ఆపాల్సింది.. మనం ఇంకా వేడుకోవాల్సింది.. మీరిద్దరూ విడిపోయినప్పుడు కూడా, అతన ఆనందంగా ఉండాలి, విజయం సాధించాలని మాత్రమే ప్రార్థించావు

  మీ ప్రేమ స్వచ్ఛమైంది

  మీ ప్రేమ స్వచ్ఛమైంది

  మీ ప్రేమ స్వచ్ఛమైంది. ప్రత్యేకమైంది. ఇప్పటికీ మీ ఇంటి నేమ్‌ప్లేట్ నుంచి అతని పేరును తీసివేయలేదు. ఆ రోజులను నేను మిస్ అవుతున్నాను. మనం ముగ్గురం లోఖండ్‌వాలాలో కలిసి ఉన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. కలిసి వంట చేయడం , కలిసి తినడం, ఎసిలోని నీరును తీసేయడం, మటన్‌తో కూడిన ప్రత్యేకమైన వంట, ఉతాన్, లోనావాలా, గోవా లాంగ్ డ్రైవ్‌లు! మన హోలీ..మనం పంచుకున్న ఆ నవ్వులు, మనమంతా ఒకరికొకరు ఉన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి.

  ఎక్కువగా నవ్వించేదానివి.

  ఎక్కువగా నవ్వించేదానివి.

  సుశాంత్ ముఖంలో చిరునవ్వు తెచ్చేందుకు నీవు చేసిన పనులు. నువ్వే అందరికంటే ఎక్కువగా నవ్వించేదానివి. మీరిద్దరు ఒకరికోసం ఒకరు పుట్టారని ఈ రోజుకీ నాకు అనిపిస్తుంది. మీది నిజమైన ప్రేమ. ఈ ఆలోచనలు, ఈ జ్ఞాపకాలు నా హృదయాన్ని దెబ్బతీస్తున్నాయి. నేను వాటిని తిరిగి ఎలా పొందగలను! నేను వాటిని తిరిగి కోరుకుంటున్నాను! నాకు మళ్లీ మన ముగ్గురం తిరిగి కావాలి అనిపిస్తుంది! మాల్పువా గుర్తుందా!? అతను చిన్న పిల్లవాడిలా మా అమ్మను మటన్ కూరను ఎలా అడిగేవాడో గుర్తుందా?

  నీవు మాత్రమే రక్షించగలవు..

  నీవు మాత్రమే రక్షించగలవు..

  నీవు మాత్రమే అతన్ని రక్షించగలవని నాకు తెలుసు. మనం కలలుగన్నట్లు మీరిద్దరూ వివాహం చేసుకోవాలని కోరుకున్నాను. నువ్ అక్కడే ఉండేందుకు ఒప్పుకుని ఉండి ఉంటే.. అతడిని కాపాడగలిగేదానివి.నువ్ అతనికి ఎప్పటికీ స్నేహితురాలు, భార్య, తల్లి, బెస్ట్ ఫ్రెండ్. ఐ లవ్ యు అంకిత. నీలాంటి స్నేహితురాలిని ఎప్పటికీ కోల్పోను. నేను ఈ విషయాన్ని జోర్ణించుకోలేకపోతున్నా'ని సందీప్ సింగ్ ఎమోషనల్ అయ్యాడు.

  English summary
  Sandeep singh Emotional Post On Sushant And Ankita Lokhande. he says that Dear Ankita, with each passing day, one thought keeps haunting me over and over again.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X