twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బొమ్మ దద్దరిల్లింది.. సరిలేరు నీకెవ్వరు ఇంటర్వెల్ సీన్.. పిల్లల టాలెంట్‌కు డైరెక్టర్ ఫిదా

    |

    సరిలేరు నీకెవ్వరు చిత్రం మహేష్ బాబు అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. హీరోయిజాన్ని, మాస్‌ను పీక్స్‌లో చూపించిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి విజన్‌కు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ముగ్దులైపోయారు. ఎంట్రీ సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్, కామెడీ, మ్యానరిజం, డ్యాన్సులు ఇలా ప్రతీ దాంట్లోనూ ఎంతో కేర్ తీసుకుని డిజైన్ చేశాడు డైరెక్టర్. అన్నింటి కంటే సరిలేరు నీకెవ్వరులో యాక్షన్ సీన్స్‌కే అగ్రతాంబూలం ఇవ్వాల్సి ఉంటుంది.

     నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్..

    నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్..

    తెలుగులో సినిమాలో అంతవరకు రాని ఇంటర్వెల్ సీన్ అది. కర్నూలు కొండా రెడ్డి బుర్జు సెంటర్ వద్ద మహేష్ బాబు చూపించిన హీరోయిజం, చేసిన యాక్షన్, చెప్పిన డైలాగ్‌లు, ఆ మ్యానరిజం నిజంగానే నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్‌గా నిలిచిపోయింది. ఈ సీన్స్‌కు థియేటర్లలో విజిల్స్‌తో మోత మోగింంది.

    రీ క్రియేషన్..

    రీ క్రియేషన్..

    రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ సీక్వెన్స్‌ను కొందరు పిల్లలు స్ఫూప్ చేసి ఆ మ్యాజిక్‌ను రీక్రియేట్ చేశారు. అయితే సినిమాలో అలాంటి యాక్షన్ తీయాలంటే ఎన్ని రోజులు ఎంత మంది కష్టపడాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    పిల్లల యాక్షన్..

    పిల్లల యాక్షన్..

    సినిమాల్లో అయితే యాక్షన్ సీక్వెన్స్‌ను తీసేందుకు ఫైట్ మాస్టర్, అసిస్టెంట్స్, రోప్స్, డూప్స్ అని ఇలా ఎన్నో ఉంటాయి. కానీ ఈ పిల్లలు చేసిన విన్యాసాలు చూస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే. నిజంగానే సినిమాటిక్ ఎఫెక్ట్‌లను తీసుకొచ్చేలా యాక్షన్ సీక్వెన్స్‌ను స్ఫూప్ చేశారు. ఇక మహేష్ బాబు వేసే సెటైర్స్, ఇంటెన్సిటీతో చెప్పే డైలాగ్‌లు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసి ఔరా అనిపించారు.

    Recommended Video

    Mahesh Babu & Nithiin Heartfelt Condolences To Handwara Martyr's
    డైరెక్టర్ ఫిదా..

    డైరెక్టర్ ఫిదా..

    మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ పిడుగులు చేసిన ఈ సాహసం అందర్నీ మెప్పించింది. ఇది వైరల్ అయి ఏకంగా దర్శకుడు అనిల్ రావిపూడి కంటపడింది. దీనిపై అనిల్ స్పందిస్తూ.. ‘ఈ పిల్లల అంకితభావం అద్భుతం.. ఇది చూసి నిజంగా నేను స్టన్ అయిపోయాను. ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది వీళ్లు పిల్లలు కాదు పిడుగులు (Note: ఇలాంటివి ఎటువంటి జాగ్రత్త లు లేకుండా చేయడం ప్రమాదం జాగ్రత్త పిల్లలూ )' అని ట్వీట్ చేశాడు.

    English summary
    Sarileru Neekevvaru Interval Scene Remade By children. I am truly stunned and pleasently surprised to see the dedication of these kids ... extraordinary.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X