మురుగదాస్‌ను ఆడేసుకొన్నారు.. డైరెక్షన్ చాలూ.. పెట్టిన పంగనామాలు అని నెటిజన్ల షాక్
ఏఆర్ మురుగదాస్, సూపర్‌స్టార్ విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన సర్కార్ సినిమాపై ప్రేక్షకులు, అభిమానులు వాడివేడి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సినిమా రూపొందించిన తీరుపై సోషల్ మీడియాలో మెమొలతో చీల్చి చెండాడుతున్నారు. స్పైడర్ తర్వాత సర్కార్ రూపంలో భారీ ఫ్లాప్ ముట్టగట్టుకొంటున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో సర్కార్‌పై నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయం ఇదే..

లోపాలను సరిగా చెప్పలేక
సర్కార్ ఫ్లాప్. ఈ సినిమాలో కథే లేదు. రాజకీయాల్లోని లోపాలను సరిగా చెప్పలేకపోయారు. సీన్లలో కంటిన్యూ లేక ఏ సీన్ ఎందుకు వస్తుందో అర్ధం కాలేదు. డ్రామా ఎక్కువైంది. ఊహకందని సీన్లతో సినిమా చెత్తగా మార్చాడు అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

నేను కామెంట్ చేయడం
సర్కార్ మూవీపై ఓ అభిమాని తీవ్రంగా స్పందించాడు. ఆ సినిమా గురించి నేను ఎక్కువ చెప్పలేను, మాట్లాడలేను. కామెంట్ చేయడం సమయం వృథా అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశాడు.

అతిగా కాపీ కొట్టడం
సర్కార్ ఆకట్టుకోలేకపోయింది. రాజకీయం నేపథ్యమే విజయ్ కొంపముంచింది. కాపీ కొట్టడం అతిగా కనిపించింది. సెకండాఫ్ చాలా దారుణంగా ఉంది అని మరో నెటిజన్ ఆవేదన వెల్లగక్కాడు
హ్యాట్రిక్ ఫ్లాప్‌లు
దర్శకుడు మురుగదాస్ ఇక డైరెక్షన్ చేయనక్కర్లేదేమో. వరుసగా దారుణమైన ఫ్లాప్ ఇచ్చాడు. బాలీవుడ్‌లో అకిరా, తెలుగులో స్పైడర్. ఇప్పుడు తమిళంలో సర్కార్ అంటూ ఓ నెటిజన్ దుయ్యబట్టాడు.
ఫ్లాప్ రిపోర్టులంటూ
సర్కార్ సినిమాకు ఫ్లాప్ రిపోర్టులు వస్తున్నాయి. థ్యాంక్స్ ఏఆర్ మురుగదాస్ అంటూ ఓ నెటిజెన్ సెటైర్ వేశాడు. పంగనామాలు పెట్టుకొన్న ఫొటోను షేర్ చేశాడు.


Click it and Unblock the Notifications











