twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహానటి జయంతి: సావిత్రి వందల కోట్ల ఆస్తులపై గుమ్మడి ఆఖరి మాటలు.. చివరికి రూ.2వేల అప్పు అలా తీర్చింది

    |

    మహానటి సావిత్రి అంటే తెలియని సౌత్ ప్రేక్షకులు ఉండరు. సాధారణంగా హీరోయిన్ అనగానే ఒక అందాన్ని వర్ణించి ఎదో ఒక రకంగా కామెంట్ చేయడం కామన్. కానీ సావిత్రి అనగానే అమ్మా అనే పిలుపు కూడా తొడవుతుంది. సావిత్రమ్మ అనే గౌరవం ఆమెకు మాత్రమే దక్కింది అంటే ఆమె మంచి తనమే అందుకు కారణం. మంచి వాళ్లకు మంచే జరుగుతుందనేది ఒక అబద్ధమైన మాట.. అనేలా విధి ఆడిన వింత నాటకమే మహానటి జీవితం. ఇక నేడు సావిత్రి జయంతి. పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆమెను గుర్తు చేసుకుంటున్నారు.

    బయోపిక్ లో చెప్పని విషయాలు

    బయోపిక్ లో చెప్పని విషయాలు

    సావిత్రి అనగానే అందం, అభినయం అనే కాదు అంతకంటే ఎక్కువగా గుర్తొచ్చేది ఆమె గుణం. ఆమెతో పని చేసిన నటులను ఎవరిని అడిగినా చెబుతారు ఆమె మనస్తత్వం ఎలాంటిదో. సావిత్రి జీవితం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. సీనియర్ స్టార్స్ చాలా ఇంటర్వ్యూలలో అమ్మ గొప్పతనం గురించి ఎన్నో తెలియని విషయాలను చెప్పారు. కానీ బయోపిక్ లో మాత్రం ఆ విషయాలన్నింటిని చూపించడానికి వీలు పడలేదు.

    డబ్బు ఉన్నా లేకపోయినా..

    డబ్బు ఉన్నా లేకపోయినా..

    ఇక సీనియర్ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు చివరగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎవరికి తెలియని విషయాన్ని చెప్పారు. ఆయన చెప్పిన మాటలతోనే అర్థం చేసుకోవచ్చు సావిత్రి నిజాయితీగా నిలువెత్తు నిదర్శనమని. మాట తప్పని మహిళ అని. డబ్బు ఉన్నా లేకపోయినా కూడా ఎదుటి మనిషిని గౌరవించే రకం అని గుమ్మడి చాలా ఎమోషనల్ గా వివరణ ఇచ్చారు.

    రూ.2వేలు తలకింద పెట్టి వెళ్లిపోయింది

    రూ.2వేలు తలకింద పెట్టి వెళ్లిపోయింది

    గుమ్మడి ఏమన్నారంటే.. సూర్యకాంతం తరువాత నన్ను అన్నయ్య అని పిలిచే నటిమణుల్లో సావిత్రి ఒకరు. ఒకనొక సమయంలో నేను అస్వస్థతకు గురైనప్పుడు చూడటానికి వచ్చింది. డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వడంతో కాస్త మత్తుతో అలాగే నిద్రలోకి జారుకున్నాను. అయితే ఎందుకో చిన్నగా నా తల దిండు సర్దినట్లు అనిపించింది. లేచిన తరువాత చూడలనిపించి దిండు కింద చూశాక రెండు వేల రూపాయలు కనిపించాయి.

    చబిపోయేలోపు బాకీ ఉండకూడదు అంటూ..

    చబిపోయేలోపు బాకీ ఉండకూడదు అంటూ..

    రెండు వేల రూపాయలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని కొద్దిసేపు ఆలోచించి వెంటనే అనుమానంతో సావిత్రికి ఫోన్ చేశాను. తనే పెట్టానని చెప్పింది. ఒకనొక సమయంలో అవసరం ఉండి తీసుకున్నాను కదా అన్నయ్య .. నేను చనిపోయే లోపు ఏ ఒక్కరికి దమ్మిడీ కూడా బాకి ఉండకూడదని సావిత్రి నాతో చెప్పింది. అప్పుడే నా కళ్ళు ఒక్కసారిగా చెమ్మగిళ్ళయి అని గుమ్మడి తెలిపారు.

    Recommended Video

    Will Keerthy Suresh Again In A Legendary Actress Biopic
    అప్పట్లోనే వందల కోట్లు

    అప్పట్లోనే వందల కోట్లు

    ఆస్తుల గురించి మాట్లాడిన గుమ్మడి.. సావిత్రి ఆస్తులు అప్పట్లోనే వందల కోట్లు ఉండేవని అన్నారు. మద్రాస్ లోనే కాకుండా హైదరాబాద్ లో కూడా ఎన్నో స్థలాలు ఇల్లు ఉండేవని చెప్పారు. గుమ్మడి చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు గనక ఆమె ఆస్తులు ఉండి ఉంటే.. ఇక ఆ లెక్కలు లక్షల కోట్ల విలువను కలిగి ఉండేవి.

    చివరికి ఒక కారు షెడ్డులో..

    చివరికి ఒక కారు షెడ్డులో..

    వందల కోట్లు సంపాదించినప్పటికి కూడా సావిత్రి ఏనాడు ఎవరికి కూడా అన్యాయం చేయలేదని గుమ్మడి తెలిపారు. కానీ ఆమెను మాత్రం అందరూ మోసం చేశారు. కట్టుకున్నవాడు కుటుంబ సభ్యులు స్నేహితులు పని వాళ్ళు.. అందరూ మోసం చేశారని వందల కోట్ల ఆస్తులను చూసిన సావిత్రి చివరికి ఒక కారు షెడ్డులో ఏడాది పైగా కోమాలో నరకాన్ని చూసిందని అన్నారు. చివరగా సావిత్రి జీవితం అందరికి ఒక గుణపాఠం అంటూ.. సావిత్రి లాంటి మహానటి మళ్ళీ జన్మించాలి అంటే మరో శతాబ్దం పడుతుందని గుమ్మడి తన చివరి ఇంటర్వ్యూలో తెలియజేశారు.

    English summary
    Savitri is not just about beauty and performance, it is more about her qualities. Anyone who asks the actors who worked with her will tell you what her mentality is. Little is said about Savitri's life. Senior Stars said many unknown things about Amma’s greatness in many interviews. But the biopic did not allow us to show all those things.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X