అఖిల్ హీరోయిన్ పెళ్లి.. గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌లో .. సంజయ్ దత్ స్పెషల్ ఎట్రాక్షన్!
అఖిల్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన బాలీవుడ్ పిల్ల సాయేషా సైగల్ పెళ్లికూతురైంది. తమిళ హీరో ఆర్యతో ప్రేమలో పడిన ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కింది. ప్రముఖ సినీ దిగ్గజాలు దిలీప్ కుమార్, సైరా భాను మనువరాలు సాయేషా అనే విషయం తెలిసిందే. ఆర్య, సాయేషా పెళ్లికి హైదరాబాద్ వేదికగా మారడం గమనార్హం. ఈ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు హాజరుకావడం విశేషంగా మారింది. వివరాల్లోకి వెళితే..

పీకల్లోతు ప్రేమలో ఆర్య, సాయేషా
ఆర్య, సాయేషా తొలిసారి గజినికాంత్ చిత్రంలో కలిసి నటించారు. ఆ చిత్ర షూటింగ్‌లోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హైదరాబాద్‌లో మార్చి 9, 10 తేదీల్లో వివాహానిక ఏర్పాట్లు చేశారు.

ముంబైలో సంగీత్ కార్యక్రమం
సాయేషా పెళ్లి సంబురాలు ముంబైలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వివాహ వేడుకలో భాగంగా జరిగిన సంగీత్ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు తరలి వచ్చారు. యాంగ్రీ హీరో సంజయ్ దత్ ఈ సెలబ్రేషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారారు. అలనాటి నటి అంజు మహేంద్రు, సూరజ్, ఆదిత్య పంచోలి ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఆకట్టుకొన్న సాయేషా సైగల్
సంగీత్ వేడుకలో పింక్ కలర్ లహేంగా ధరించిన సాయేషా అందర్ని ఆకట్టుకొన్నది. తన అమ్మమ్మ సైరాభానుతో కలిసి సాయేషా డ్యాన్సులతో అదరగొట్టింది. దిలీప్ కుమార్ కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటం కారణంగా వేడుకలో పాల్గొన్నప్పటికీ.. పెద్దగా కానరాలేదు.

ప్రైవేట్ కార్యక్రమంగా సాయేషా పెళ్లి
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లో క్రేజీగా మారిన ఈ పెళ్లికి సంబంధించిన వేదికను చాలా గోప్యంగా ఉంచారు. సోషల్ మీడియాలో వెడ్డింగ్ కార్డులు వైరల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. అత్యంత ప్రైవేట్ కార్యక్రమంగా ఈ వివాహాన్ని జరిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఆర్య ఫొటోలు బయటకు పొక్కకపోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications











