twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేప్ సీన్లతోనే సెంచరీకి దగ్గరైన తెలుగు నటుడు.. అతన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకునేవారంటే?

    |

    సినిమా ఇండస్ట్రీలో గత 20 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు రివెంజ్ డ్రామాలు ఎక్కువగా ఉండేవి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకునే విధంగా ఫ్యామిలీ డ్రామాలు అయితే ఒక ట్రెండ్ సెట్ చేశాయి. అయితే 1980, 90లలో మాత్రం మరొక ట్రెండ్ నడిచింది. ఆ సమయంలో ఒక నటుడు మాత్రం ఎక్కువగా రేప్ సీన్లతోనే ఫేమస్ అయ్యారు. ఆ నటుడు మరెవరో కాదు.. చలపతిరావు.

    సినిమా ఇండస్ట్రీలో 55ఏళ్లకు పైగా..

    సినిమా ఇండస్ట్రీలో 55ఏళ్లకు పైగా..

    కేవలం విలన్ అనే కాకుండా కామెడీ రోల్స్ ఎమోషనల్ పాత్రల్లో కూడా నటించిన చలపతిరావు రావు ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు 55 ఏళ్లవుతోంది. ప్రస్తుతం ఉన్న అత్యంత సీనియర్ నటులలో ఆయన ఒకరు. కృష్ణ గూఢచారి 116 సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆయన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

    మొత్తం 1500 సినిమాల్లో రేప్ సీన్స్ ఎన్నంటే..

    మొత్తం 1500 సినిమాల్లో రేప్ సీన్స్ ఎన్నంటే..

    ఇక చలపతి రావు మొత్తం 1500కు పైగా సినిమాల్లో నటించగా అందులో 94 రేప్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ నటుడు కూడా ఈ రేంజ్ లో రికార్డ్ అందుకోలేదని చెప్పవచ్చు. మరో సిక్స్ కొడితే సెంచరీ అయ్యుండేది. ఇక మెల్లగా చలపతిరావు విలన్స్ రోల్స్ తో పాటు పవర్ఫుల్ సపోర్టింగ్ రోల్స్ కు షిఫ్ట్ అయ్యారు.

    అతన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకునే వారంటే..

    అతన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకునే వారంటే..

    ఇక అప్పట్లో విలన్ రేప్ చేయాలి అని సీన్ రాసుకున్నారు అంటే మొదట చలపతిని సెలెక్ట్ చేసుకునేవారట. తోటి ఫీమేల్ ఆర్టిస్ట్ ను ఇబ్బంది పెట్టకుండా నటిస్తూ.. ఆయన చాలా సపోర్ట్ చేసేవరట. అందుకే దర్శకులు నటీమణులు రేప్ సీన్ విషయంలో పెద్దగా ఇబ్బంది పడేవారు కాదని అప్పట్లో ఒక టాక్ అయితే భాగనే వచ్చేది..

    Recommended Video

    Bombhaat Director About Chandini Chowdary | Bombhaat Team Interview Part 4
    దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తనయుడు

    దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తనయుడు

    ప్రస్తుతం 76ఏళ్ళ వయసుతో ఉన్న చలపతిరావు ఒక తండ్రిగా పోలీస్ ఆఫీసర్ గా అలాగే పొలిటీషియన్ వంటి పాత్రలతో బిజీగా మారారు. ఇక ఆయన తనయుడు రవిబాబు ప్రస్తుతం దర్శకుడిగా సరికొత్త ప్రయోగలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరగా రవిబాబు అదుగో, ఆవిరి వంటి సినిమాలను డైరెక్ట్ చేశాడు. త్వరలో ఒక లవ్ స్టోరీతో రానున్నట్లు సమాచారం..

    English summary
    The last 20 years have seen many changes in the film industry. Revenge dramas were once more prevalent. Family dramas, however, have set a trend, especially to appeal to family audiences. However, another trend followed in the 1980s and 90s. At the time, only one actor became famous for his rape scenes. That actor is not someone else
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X