ఒకప్పుడు నాగ శౌర్య మేనత్త టాప్ హీరోయిన్ అనే విషయం తెలుసా? ఆమెతో గొడవలు ఏమిటంటే?
ప్రస్తుతం ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ల హవా నడుస్తోంది. ఇప్పటి జనరేషన్ వాళ్లకు వారు ఎవరు అనేది కూడా తెలియదు. ఇక కొంతమంది అయితే ఎన్నో మంచి సినిమాల్లో నటించి ఇప్పుడు సినిమాలకు దూరమయ్యారు. పెళ్లిళ్లు చేసుకొని పిల్లలతో జీవితం గడుపుతున్నారు. ఈ మధ్య టాక్ షోస్ అన్ని .. అలా పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైన వారిని ఇంటర్వ్యూ లకు పిలిచి అప్పటి వారి గత స్మృతులను వెలికితీస్తున్నారు. అలా చాలా కాలం తరువాత ఒక ఇంటర్వ్యూలో మరోసారి ప్రేక్షకులకు చేరువైంది లతా శ్రీ.
ఆమె ఒకప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్. హీరోలకు చెల్లెలిగా.. విలన్స్ కు గర్ల్ ఫ్రెండ్ గా ఎన్నో మంచి చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా యమలీల సినిమాలో.. యముడును సైతం తన అందచందాలతో మైమరిపించిన అందం ఆమె సొంతం. దాదాపు 70 కి పైగా సినిమాల్లో చేసిన లతా మేనల్లుడు ఒక స్టార్ హీరో అన్న విషయం మీకు తెలుసా.. ? అతను ఎవరో కాదు.. కుర్ర హీరో నాగ శౌర్య. అతని తండ్రి శంకర్ ప్రసాద్ మూల్పూరి సొంత చెల్లెలు లతా శ్రీ.

అయ్యా.. అవునా ఇప్పటివరకు ఆమె ఎందుకు బయట కనిపించలేదు అన్న ప్రశ్నకు సమాధానం ఆమె పాత ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చింది . లతా శ్రీ ఒక జిమ్ ట్రైనర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని 1999 తరువాత సినిమాలకు దూరమైంది. ఆ తరువాత 2007లో ఈవీవీ సత్యనారాయణ అత్తిలి సత్తిబాబు'సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే లతా శ్రీ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నా.. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు ఇంజనీరింగ్ చేస్తుండగా.. రెండో కొడుకు బీటెక్ చేస్తున్నాడు.
ఇంత నేమ్.,. ఫేమ్ ఉన్నా కూడా లతా గురించి నాగ శౌర్య కానీ, అతని తండ్రి కానీ ఎందుకు నోరువిప్పలేదు .. ? చివరికి శౌర్య పెళ్ళిలో కూడా మేనత్త హోదాలో ఆమె కనిపించలేదు. అందుకు కారణం.. ఇరు కుటుంబాల మధ్య ఉన్న విబేధాలే అని చెప్పుకొచ్చింది. "చాలామంది నా అన్నయ్య కాని, మేనల్లుడు నాగశౌర్యని కాని.. ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా అంటే లేరని అంటున్నారు.. కానీ, నాకు నా అన్నయ్య ఉండి లేడని చెప్పలేను. ఉన్నాడంటే ఉన్నాడనే అంటా.. వాళ్ల గురించి నేను ఇంతకన్నా చెప్పాలని అనుకోవడం లేదు.
అయితే నా పేరు చెప్పుకోవడానికి వాళ్లు ఇష్టపడరు.. అలాంటప్పుడు నా మేనల్లుడు నాగశౌర్య పేరుకాని.. నా అన్నయ్య పేరుకాని చెప్పుకోవాలని నేను అనుకోవడం లేదు.. కాని నా తోడపుట్టినోడు కాబట్టి నీతో పాటు ఎవరైనా ఉన్నారా అంటే మా అన్నయ్య ఉన్నాడని చెప్తున్నా.. వాళ్లు అది కూడా చెప్పుకోలేకపోతున్నారు. శౌర్య ఇండస్ట్రీకి ఎలా వచ్చాడో వాళ్లకి తెలుసు. ఆ ఫ్యామిలీతో ఇబ్బందులు గొడవలు అని కాదు కాని.. చిన్న చిన్న మిస్ అండర్ స్టాడింగ్ వచ్చాయి.
నా అన్నయ్య మీద నాకు ఇష్టం ఉంటుంది. అన్నయ్య మనోడే.. మేనల్లుడు మనోడే.. కాని వదిన మనది కాదు కదా.. ఖచ్చితంగా అల్లుడు అంటే ఏ అత్తకు అయినా ఇష్టం ఉంటుంది. అతని సినిమాలు కూడా చూస్తా. అమ్మతో కలిసి చూసేదాన్ని. ఈ మధ్య కాలంలో చూడలేదు కాని.. ఊహలు గుసగుసలాడే చూశా.. " అని చెప్పుకొచ్చింది.
ఇది ఆమె పాత ఇంటర్వ్యూలో చెప్పినా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. తల్లిదండ్రులు గొడవలవలన మాట్లాడలేకపోయినా.. కనీసం శౌర్య అయినా అత్తతో అప్పుడప్పుడు మాట్లాడితే బావుండేది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు . ప్రస్తుతం నాగ శౌర్య వరుస సినిమాలతో బిజీగా మారాడు.


Click it and Unblock the Notifications











