Meena: ఊహించని వీడియో షేర్ చేసిన మీనా.. భర్త చనిపోయిన తర్వాత తొలిసారి ఇలా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది భామలు హీరోయిన్లుగా సందడి చేశారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే తరతరాలు గుర్తుండిపోయేలా ప్రభావాన్ని చూపించగలిగారు. అందులో సీనియర్ హీరోయిన్ మీనా ఒకరు. అదిరిపోయే యాక్టింగ్‌తో పాటు క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈమె.. ఇప్పటికీ తనదైన చిత్రాలతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్నారు. ఇక, గత ఏడాది భర్తను కోల్పోయిన తర్వాత కామ్ అయిన మీనా.. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ వీడియోను వదిలారు. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

చైల్ట్ ఆర్టిస్టు.. సూపర్ స్టార్‌గా

చైల్ట్ ఆర్టిస్టు.. సూపర్ స్టార్‌గా


సౌతిండియన్ సూపర్ స్టార్ హీరోయిన్ అయిన మీనా చైల్డ్ ఆర్టిస్టుగానే తన కెరీర్‌ను మొదలు పెట్టారు. ఇలా ఎన్నో చిత్రాల్లో ఆమె నటించారు. అయితే, హీరోయిన్‌గా మాత్రం తెలుగులోనే పరిచయం అయ్యారు. ఆ తర్వాత సౌత్‌లో చాలా సినిమాల్లో నటించారు. దీంతో ఆమె రేంజ్ భారీగా పెరిగింది. ఫలితంగా దక్షిణాదిలోని గొప్ప హీరోయిన్ల జాబితాలోనూ మీనా చోటును పొందారు.

మంచి జీవితం.. బ్రేక్ లేదు

మంచి జీవితం.. బ్రేక్ లేదు


నటి మీనా బెంగళూరుకు చెందిన విద్యాసాగర్‌ను 2009 జూలై 12న ఆర్యవైశ్య సమాజ్ మండపంలో వివాహం చేసుకున్నారు. వీళ్లకు నైనిక అనే పాప కూడా జన్మించింది. అయినప్పటికీ ఆమె కెరీర్‌ను మాత్రం కంటిన్యూ చేస్తూనే వచ్చారు. ఇలా మొదట్లో హీరోయిన్‌గా నటించిన ఆమె.. క్రమంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. అంతేకాదు, ప్రతి ఏడాది ఒక సినిమాలోనైనా చేస్తున్నారు.

భర్త మృతితో షాక్‌లో మీనా

భర్త మృతితో షాక్‌లో మీనా


మీనా భర్త విద్యాసాగర్ 2022 జూన్‌లో మరణించిన విషయం తెలిసిందే. చాలా కాలంగా శ్యాసకోస సంబంధిత సమస్యలతో బాధ పడిన ఆయన.. గత ఏడాది ఆరంభంలో కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి విద్యాసాగర్ ఆరోగ్యం మరింతగా క్షిణించింది. దీంతో ఆయన కన్నుమూశారు. భర్త మరణించిన తర్వాత మీనా కాసింత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసి

రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసి


భర్త మరణం తర్వాత మీనా కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల రెండో పెళ్లికి సిద్ధం అయిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె 'నా భర్త మరణంతో నేను విచారంలో ఉన్నాను. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని మా కుటుంబ గోప్యతకు భంగం కల్పించకూడదని కోరుతున్నా. అలాగే, నేను రెండో పెళ్లి చేసుకుంటున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు' అని చెప్పుకొచ్చారు.

వరుస ఆఫర్లు.. ఫుల్ బిజీగా

వరుస ఆఫర్లు.. ఫుల్ బిజీగా


విద్యాసాగర్ మరణం తర్వాత కొన్ని రోజులు మాత్రమే బ్రేక్ తీసుకున్న మీనా... ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నారు. ఇలా ప్రస్తుతం ఆమె 'రౌడీ బేబీ' అనే తమిళ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. అలాగే, మలయాళంలో 'జనమ్మ డేవిడ్' అనే సినిమాను చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని చిత్రాలకు సైతం మీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

సోషల్ మీడియాలో యాక్టివ్


దాదాపు మూడు దశాబ్దాలుగా ఏకధాటిగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న మీనా.. కొంత కాలంగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోన్నారు. ఇందులో భాగంగానే ఎన్నో విషయాలను తన ఫ్యాన్స్‌తో షేర్ చేస్తున్నారు. అలాగే, ఫొటోలు, వీడియోలను కూడా వదులుతున్నారు. భర్త చనిపోయిన తర్వాత గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యారు.

డ్యాన్స్ వీడియో.. వైరల్‌గా

డ్యాన్స్ వీడియో.. వైరల్‌గా


సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోన్న మీనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ డ్యాన్స్ వీడియోను షేర్ చేశారు. ఇందులో ఆమెతో పాటు నటి సంఘవి కూడా ఉన్నారు. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోన్న 'ఎనిమీ' మూవీలోని సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే, మీనాపై కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X