షాకిస్తున్న సౌందర్య ఆస్తుల లెక్కలు.. వారసుల మధ్య ఇంకా తగ్గని వివాదాలు..

అందం అనే పదానికి మరో అర్ధాన్ని చెప్పిన బ్యూటీ సౌందర్య. దశాబ్ద కాలంపాటు తిరుగులేని స్టార్ హీరోయిన్ గా వెండితెరపై వెలిగిన సౌందర్య భాషాభేదం లేకుండా వందకు పైగా చిత్రాల్లో నటించింది. ఒకనోక సమయంలో ఆమె స్టార హీరోల రేంజ్ లో రెమ్యునరేషన్ కూడా అందుకున్నారు. నేటితరం సావిత్రి అనేలా అప్పట్లో ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. అయితే ఆమె మరణించిన తరువాత ఆమె ఆస్తులు ఎవరి చేతుల్లోకి వెళ్లాయి అనేది పెద్దగా ఎవరికి తెలియదు.. ఆ వివరాలపై ఒక లుక్కేస్తే..

ఆ విషధ ఘటనకు 16ఏళ్ళు..

ఆ విషధ ఘటనకు 16ఏళ్ళు..

సౌందర్య మరణించి 16 ఏళ్లవుతోంది. 2004 ఏప్రిల్ 17న ఒక ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో ఆమె మరణించారు. అప్పటికి ఆమె వయసు 31 సంవత్సరాలు. అలాగే సౌందర్య సోదరుడు అమర్ నాథ్ కూడా అదే ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. సౌందర్య తల్లిదండ్రులను ఒంటరి చేసిన ఆ విషాద ఘటన అప్పట్లో అభిమానులకు తీవ్ర మనోవేదనకు కలిగించింది.

షాకిస్తున్న ఆస్తుల లెక్క..

షాకిస్తున్న ఆస్తుల లెక్క..

ఇక సౌందర్య ఆస్తుల లెక్క చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఆమె ఎంతగా సంపాదించారో అదే తరహాలో పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇప్పటికి కూడా ఆస్తుల నుంచి వస్తున్న ఆదాయం ద్వారా కొన్ని ట్రస్టులకు విరాళాలు వెళుతున్నాయి. అయితే సౌందర్య మరణించిన నాటికి ఆమె ఆస్తుల విలువ 100కోట్లని తెలుస్తోంది.

 ఆస్తులు పెరగడానికి కారణం..

ఆస్తులు పెరగడానికి కారణం..

సౌందర్య సోదరుడి సహాయంతో ఎక్కువగా రియల్ ఎస్టేట్స్ వైపు పెట్టుబడి పెట్టి భారీగా సంపాదించారని టాక్ వచ్చింది. ఎక్కువగా స్థలాలు కొనడమే ఆమె ఆస్తులు పెరగడానికి కారణమైంది. అయితే సౌందర్య మరణాంతరం ఆమె సోదరుడి భార్య నిర్మల ఆస్తుల విషయంలో కోర్టుకు ఎక్కడం అప్పట్లో సంచలనం సృష్టించింది. మరోవైవు సౌందర్య తల్లి మంజుల, సౌందర్య భర్త రఘు కలిసి ఆస్తులను దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు.

Recommended Video

Jagapathi Babu Opens Up On The Affair With Soundarya
తగ్గని గొడవలు..

తగ్గని గొడవలు..

2009 నుంచి మొదలైన సౌందర్య ఆస్తుల గొడవలు కొన్నాళ్లపాటు అలానే కొనసాగాయి. సౌందర్య వదిన, మరోవైవు తల్లి, భార్యల మధ్య గొడవలు తీవ్రం కావడంతో 2013లో ఇరువర్గాలు ఒకసారి చర్చించుకొని ఒక నిర్ణయానికి రావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తరువాత ఆస్తుల పంపకాలు సరిగ్గానే జరిగినప్పటికి ఇంకా కొన్ని స్థలాల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X