46 ఏళ్ల ఏజ్‌లో తెగించిన సురేఖ వాణి.. అంతా కనిపించే డ్రెస్‌లో అరాచకంగా!
మిగిలిన భాషల కంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన నటీమణులు గ్లామర్ షో చేయడానికి అంతగా ఆసక్తి చూపించే వారు కాదు. అయితే, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీంతో ఈ మధ్య కాలంలో తెలుగు భామలు శృతిమించిన షో చేస్తున్నారు. అలాంటి వారిలో సీనియర్ నటి సురేఖ వాణి ఒకరు. చాలా కాలంగా సినిమాల్లో సత్తా చాటుతోన్న ఆమె.. కొంత కాలంగా సోషల్ మీడియాను తన అందాలతో షేక్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సురేఖ వాణి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!
టీవీ నుంచి సినిమాల్లోకి
సురేఖ వాణి యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అలా బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలను నడిపించింది. ఆ సమయంలోనే ప్రముఖ దర్శక రచయిత సురేష్ తేజను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత 'మా టాకీస్', 'హార్ట్ బీట్', 'మొగుడ్స్ పెళ్లామ్స్' అనే షోలు చేసింది. ఈ క్రమంలోనే 'శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్' మూవీతో నటిగా మారింది.

భర్త మరణం.. రీఎంట్రీ
సినిమాల్లోకి అడుగు పెట్టిన తర్వాత తనదైన నటనతో మెప్పించిన సురేఖ వాణి వరుసగా ఎన్నో ఆఫర్లను సొంతం చేసుకుంది. ఇలా మంచి మంచి పాత్రల్లో నటించి మెప్పించింది. తద్వారా మరింత బిజీగా మారిపోయింది. ఆ సమయంలోనే ఆమె భర్త మరణించారు. దీంతో చాలా కాలం పాటు సినిమాలకు సురేఖ గ్యాప్ ఇచ్చేసింది. తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది.
కూతురితో కలిసి రచ్చ
సహాయ నటిగా తెలుగు చిత్ర సీమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సురేఖ వాణి.. కూతురు సుప్రితతో కలిసి తెగ రచ్చ చేస్తోంది. ఈ మధ్య కాలంలో అయితే ఈ తల్లీ కూతుళ్లు తరచూ ట్రిప్పులకు వెళ్లడం, డ్యాన్స్ వీడియోలు చేయడం, హాట్ షోతో రెచ్చిపోవడం వంటివి చేస్తూ హైలైట్ అవుతున్నారు. ఫలితంగా సురేఖ వాణి నిత్యం వార్తల్లోనే నిలుస్తోంది.

అక్కడ యమా యాక్టివ్
అప్పట్లో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయినా.. సురేఖ వాణి మాత్రం సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లోనే సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో చెబుతోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. తద్వారా తన అభిమానాన్ని పెంచుకుంటోంది.
హీరోయిన్లకు ధీటుగానే
సురేఖ వాణి సోషల్ మీడియాలో ఎలా హల్చల్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈ సీనియర్ నటి తరచూ గ్లామర్ షో చేస్తూ రచ్చ లేపుతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు క్రమం తప్పుకుండా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేస్తోంది. అదే సమయంలో కూతురు సుప్రితతో కలిసి విపరీతంగా ఎంజాయ్ చేస్తూ తరచూ ట్రెండింగ్‌లోనే ఉంటోంది.

సురేఖ పిక్స్ వైరల్‌గా
సీనియర్ నటి సురేఖ వాణి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని గ్లామరస్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌ను వేసుకుని విపరీతంగా అందాలను ఆరబోస్తోంది. దీంతో వీటికి నెటిజన్లు అట్రాక్ట్ అయిపోతున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా లభిస్తోంది. తద్వారా ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











