46 ఏళ్ల ఏజ్‌లో సురేఖ వాణి స్టన్నింగ్ షో: చేతిలో గ్లాసు.. లుక్కేమో క్లాసు
ఒకప్పుడు సినీ రంగంలోని సీనియర్ నటీమణులు గ్లామర్‌గా కనిపించాలంటే మొహమాటపడేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చాలా మంది భామలు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ట్రీట్ ఇస్తున్నారు. అలాంటి వారిలో సురేఖ వాణి ఒకరు. సుదీర్ఘ కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన పాత్రలతో అలరిస్తోన్న ఈ భామ.. కెరీర్ కంటే పర్సనల్ విషయాలతోనే హైలైట్ అవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సురేఖ వాణి ఓ బోల్డు ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా లుక్కేయండి మరి!
యాంకర్ నుంచి నటిగా:నటిగా పరిచయం అవడానికి ముందే సురేఖ వాణి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఎన్నో షోలు చేస్తోన్నప్పుడే ప్రముఖ దర్శక రచయిత సురేష్ తేజను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత భర్త సహకారంతో 'మా టాకీస్', 'హార్ట్ బీట్', 'మొగుడ్స్ పెళ్లామ్స్' అనే షోలను హోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే 'శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్' మూవీతో నటిగా కెరీర్‌ను ప్రారంభించింది.

భర్త మృతి.. కోలుకుంది:సినిమా నటిగా ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత సురేఖ వాణి వరుసగా ఎన్నో చిత్రాల్లో అదిరిపోయే రోల్స్ చేసింది. ఫలితంగా ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. ఇలా ఫుల్ బిజీగా మారిన సమయంలోనే ఆమె భర్త సురేష్ తేజ ఆకస్మికంగా మరణించారు. ఈ దుర్ఘటన తర్వాత సురేఖ చాలా రోజుల పాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. కొన్నేళ్లకు కోలుకుని మళ్లీ కెరీర్ మొదలెట్టింది.
కూతురితో రచ్చ చేస్తూ:క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎనలేని క్రేజ్‌తో సత్తా చాటిన సురేఖ వాణి.. ఈ మధ్య కాలంలో సినిమాల వేగాన్ని తగ్గించేసింది. అయినప్పటికీ తనదైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా కూతురు సుప్రితతో కలిసి ట్రిప్పులకు వెళ్లడం, డ్యాన్స్ వీడియోలు చేయడం, హాట్ షోతో రెచ్చిపోవడం వంటివి చేస్తోంది. అంతేకాదు, రెండో పెళ్లి వార్తలతోనూ సురేఖ సెన్సేషన్ అయింది.

అందులో ఫుల్ యాక్టివ్:ఆ మధ్య చాలా వేగంగా సినిమాలు చేసినా.. ఇటీవలి కాలంలో మాత్రం కాస్త నెమ్మదించినా సురేఖ వాణి సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లోనే సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. తద్వారా తన అభిమానులను ఎప్పుడూ ఖుషీ చేస్తూనే ఉంటోంది.
అందాల ఆరబోతోనూ:సోషల్ మీడియాలో సురేఖ వాణి ఏ రేంజ్‌లో హడావిడి చేస్తుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సీనియర్ నటి తరచూ అందాలను ప్రదర్శిస్తూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అదే సమయంలో కూతురు సుప్రితతో కలిసి షార్ట్ డ్రెస్‌లు వేస్తూ ఓ రేంజ్‌లో హాట్ షో చేస్తూ సంచలనం అవుతోంది.

బోల్డు ఫొటో వదిలింది:సీనియర్ నటీమణి సురేఖ వాణి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ బోల్డు ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె హాట్ డ్రెస్‌ను వేసుకుని విపరీతంగా క్లీవేజ్, లెగ్స్ షో చేస్తోంది. దీంతో ఆమె అందాలు కుర్రకారును ఉర్రూతలూగిస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. తద్వారా ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్ అవుతోంది.
అలాంటి కామెంట్లతో:సోషల్ మీడియాలో సురేఖ వాణి తాజాగా షేర్ చేసిన హాట్ ఫొటోపై కొందరు ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఓ వర్గం వాళ్లు ఈ వయసులో బోల్డు షో చేయడం అవసరమా అంటూ ఆమెను తెగ తిడుతున్నారు. మరికొందరు మాత్రం సురేఖ వాణి అందాలను వర్ణిస్తూ సపోర్టుగా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ సీనియర్ నటి మరోసారి వార్తల్లో హెడ్‌లైన్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











