గోవాలో పొట్టి బట్టల్లో సురేఖ వాణి: మళ్లీ చేసుకుంటా అంటూ షాకిచ్చిన నటి
గతంలో పేరున్న హీరోయిన్లు మాత్రమే బాగా హైలైట్ అయ్యేవారు. వాళ్లే ఎక్కువగా వార్తల్లో నిలిచేవారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు ఎలాంటి సెలెబ్రిటీ అయినా దీనివల్ల సెన్సేషన్ అవుతున్నారు.
అందులో సీనియర్ నటి సురేఖ వాణి ఒకరు. చాలా కాలం క్రితమే మూవీల్లోకి వచ్చిన ఆమె.. ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తూ మరింత పాపులర్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సురేఖ వాణి ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చి సర్‌ప్రైజ్ చేస్తూ కొన్ని కామెంట్లు చేసింది. ఆ వివరాలు మీకోసమే!

అలా మొదలైన ప్రయాణం: సురేఖ వాణి ముందుగా యాంకర్‌గా సత్తా చాటింది. ఇలా షోలు చేస్తోన్నప్పుడే ప్రముఖ దర్శక రచయిత సురేష్ తేజను ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి 'మా టాకీస్', 'హార్ట్ బీట్', 'మొగుడ్స్ పెళ్లామ్స్' అనే షోలను నడిపించింది. ఈ క్రమంలోనే 'శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్' మూవీతో నటిగా కెరీర్‌ను మొదలుపెట్టింది. తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది.

భర్త మృతితో కూతురితోనే: సురేఖ వాణి చాలా చిత్రాల్లో మంచి మంచి పాత్రలను చేసింది. తద్వారా ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. అదే సమయంలో మరిన్ని ఆఫర్లను అందుకుంది. అలా ఫామ్‌లో ఉన్నప్పుడే ఆమె భర్త సురేష్ తేజ మరణించారు. దీంతో ఆమె చాలా స్లో అయిపోయింది. అప్పుడు కూతురు సుప్రిత సహకారంతో తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. అప్పటి నుంచి మళ్లీ ఫుల్ బిజీ అయింది.

సోషల్ మీడియాలో రచ్చ: ఆ మధ్య చాలా వేగంగానే సినిమాలు చేసినా.. ఇటీవలి కాలంలో మాత్రం నెమ్మదించినా సురేఖ వాణి సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లోనే సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. తద్వారా తన అభిమానులను అలరిస్తూ.. క్రేజ్ పెంచుకుంటోంది.
కూతురితో కలిసి గోవాలో: సినిమా నటిగా ఎనలేని గుర్తింపును తెచ్చుకున్న సురేఖ వాణి.. ఈ మధ్య కాలంలో చాలా స్లోగానే మూవీలు చేస్తోంది. అయినప్పటికీ తనదైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా కూతురు సుప్రితతో కలిసి ట్రిప్పులకు వెళ్లడం, డ్యాన్స్ వీడియోలు చేయడం, హాట్ షోతో రెచ్చిపోవడం వంటివి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సుప్రితతో కలిసి గోవా వెళ్లింది.

పొట్టి బట్టల్లోనే లైవ్‌లోకి: టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లైవ్‌లోకి వచ్చింది. ఇందులో ఆమె బికినీ టైప్ పొట్టి డ్రెస్‌ను వేసుకుని కనిపించింది. అంతేకాదు, డిఫరెంట్ యాంగిల్స్‌లో సెల్ఫీ వీడియో ద్వారా ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. దీంతో ఆమె లైవ్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభించింది. ఇక, ఇందులో సురేఖ ఎన్నో విషయాలను కూడా పంచుకుంది.
ఆరోగ్యంపై క్లారిటీ ఇస్తూ: తాజాగా సురేఖ వాణి ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో చాలా మంది ఆమె గుండు గురించి మాట్లాడారు. ఈ సందర్భంలోనే ఆమెకు హెల్త్ బాలేదని వస్తున్న వార్తలపై స్పందించింది. 'నేను చాలా రోజులుగా దీనిపై స్పందించాలని అనుకుంటున్నా. నేను తిరుపతి వెళ్లినందుకే గుండు చేయించుకున్నా. అంతేకానీ, నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదు' అంటూ సురేఖ క్లారిటీ ఇచ్చింది.

మళ్లీ చేసుకుంటా అంటూ: ఇదే లైవ్‌లో సురేఖ వాణి 'నాకు గుండు వల్ల చాలా కంఫర్ట్‌గా ఉంది. ఒక ఐదారేళ్ల తర్వాత మళ్లీ చేసుకుంటాను' అంటూ క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత అదే గదిలో ఉన్న తన కూతురు సుప్రితను కూడా చూపించింది. ఆ సమయంలోనే ఆమె డ్రెస్ గురించి ఫన్నీ కామెంట్లు చేసింది. మొత్తానికి సురేఖ తన గుండు, ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చి పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేసింది.


Click it and Unblock the Notifications











