గుండుతో షాకిచ్చిన సీనియర్ నటి.. అల్ట్రా స్టైలిష్‌గా ఉన్న ఈమెను గుర్తు పట్టారా?

సాధారణంగా సినీ రంగంలో ఉన్న నటీమణులు క్రేజ్, ఫాలోయింగ్‌ను తెచ్చుకోవాలంటే వాళ్లకు మంచి పాత్రలు పడాల్సిన అవసరం ఉంటుంది. కానీ, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీని ద్వారా ఎంతో మంది భామలు తెగ హైలైట్ అవుతూనే ఉన్నారు.

అలాంటి వారిలో సీనియర్ నటి సురేఖ వాణి ఒకరు. చాలా కాలంగా సినిమాల్లో ఉన్న ఈమె.. సోషల్ మీడియా వల్ల సెన్సేషన్ అవుతోంది. దీంతో ఇందులో యమ ఫొటోలు వదులుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఊహించని పిక్స్ షేర్ చేసిందామె. అవి మీరే చూసేయండి!

Senior Actress Surekha Vani Clean Shave Head Photos Goes Viral

అలా వచ్చి పాపులారిటీ: సురేఖ వాణి నటిగా పరిచయం అవడానికి ముందే యాంకర్‌గా వచ్చింది. ఇలా షోలు చేస్తోన్నప్పుడే ప్రముఖ దర్శక రచయిత సురేష్ తేజను లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి 'మా టాకీస్', 'హార్ట్ బీట్', 'మొగుడ్స్ పెళ్లామ్స్' అనే షోలను నడిపించింది. ఈ క్రమంలోనే 'శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్' మూవీతో నటిగా కెరీర్‌ను మొదలుపెట్టి పాపులర్ అయింది.

Senior Actress Surekha Vani Clean Shave Head Photos Goes Viral

భర్త మరణంతో తగ్గినా: సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సురేఖ వాణి చాలా చిత్రాల్లో మంచి మంచి పాత్రలను చేసింది. తద్వారా ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. అదే సమయంలో మరిన్ని ఆఫర్లను సైతం సొంతం చేసుకుంది. అలా ఫామ్‌లో ఉన్నప్పుడే ఆమె భర్త సురేష్ తేజ మరణించారు. దీంతో సురేఖ వాణి డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఆ తర్వాత కోలుకున్నా సినిమాల్లో స్లో అయింది.

Senior Actress Surekha Vani Clean Shave Head Photos Goes Viral

కూతురి కలిసి ఖుషీగా: సినిమా నటిగా విపరీతమైన పేరును తెచ్చుకున్న సురేఖ వాణి.. ఈ మధ్య కాలంలో చాలా స్లోగానే మూవీలు చేస్తోంది. అయినప్పటికీ తనదైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా కూతురు సుప్రితతో కలిసి ట్రిప్పులకు వెళ్లడం, డ్యాన్స్ వీడియోలు చేయడం, హాట్ షోతో రెచ్చిపోవడం వంటివి చేస్తోంది. అంతేకాదు, రెండో పెళ్లి వార్తలతోనూ సురేఖ క్రేజ్ పొందింది.

Senior Actress Surekha Vani Clean Shave Head Photos Goes Viral

సినిమాల కంటే అలా: చాలా కాలం పాటు వేగంగా సినిమాలు చేసినా.. ఇటీవలి కాలంలో మాత్రం కాస్త స్లో అయినా సురేఖ వాణి సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లోనే సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. తద్వారా తన అభిమానులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటోంది.

ఎక్కువగా అలాంటివి: సురేఖ వాణి సోషల్ మీడియాలో ఎలా హడావిడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈ సీనియర్ నటి తరచూ అందాలను ప్రదర్శిస్తూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అదే సమయంలో కూతురు సుప్రితతో కలిసి షార్ట్ డ్రెస్‌లు వేస్తూ ఓ రేంజ్‌లో హాట్ షో చేస్తూ సెన్సేషన్ అవుతోంది.

Senior Actress Surekha Vani Clean Shave Head Photos Goes Viral

గుండు ఫొటోతో షాక్: టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె గుండుతో కనిపించి షాకిచ్చింది. అంతేకాదు, బ్లాక్ కలర్‌ షర్ట్‌లో కళ్లజోడు పెట్టుకుని అల్ట్రా స్టైలిష్ గెటప్‌తో ఫోజులిచ్చింది. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. తద్వారా ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారాయి.

Senior Actress Surekha Vani Clean Shave Head Photos Goes Viral

అలాంటి కామెంట్లు: సురేఖ వాణి సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసిన గుండు ఫొటోలపై కొందరు ట్రోల్స్ కూడా చేస్తుండగా.. మరికొందరు మాత్రం మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. 'గుండులో కూడా చాలా అందంగా ఉన్నావు', 'హీరోయిన్లను మించిన అందం నీది', 'సురేఖ ఆంటీ గుండు బాగుంది' ఇలా పలు రకాలుగా నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X