కూతురితో కలిసి సురేఖ వాణి అరాచకం: ఉల్లిపొర లాంటి చీరల్లో అందాల ఊచకోత
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత నేటి తరం వాళ్ల నుంచి సీనియర్ నటీమణుల వరకూ ఓ రేంజ్‌లో హడావిడి చేస్తూనే ఉన్నారు. తద్వారా తమ రేంజ్‌ను మరింతగా పెంచుకుంటోన్నారు. అందులో సీనియర్ సురేఖ వాణి ఒకరు.
చాలా కాలంగా టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్న ఈ భామ.. సోషల్ మీడియాలోనూ అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది. ముఖ్యంగా కూతురు సుప్రితతో కలిసి ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సురేఖ వాణి ఓ వీడియోను షేర్ చేసింది. దాన్ని మీరే చూసేయండి!

అలా మొదలు.. సినిమాల్లో: సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే సురేఖ వాణి యాంకర్‌గా పరిచయమైంది. అలా షోలు చేస్తోన్న సమయంలోనే ప్రముఖ దర్శక రచయిత సురేష్ తేజను ఆమె పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి 'మా టాకీస్', 'హార్ట్ బీట్', 'మొగుడ్స్ పెళ్లామ్స్' అనే షోలకు యాంకర్‌గా చేసింది. ఈ క్రమంలోనే 'శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్' మూవీతో నటిగా కెరీర్‌ను మొదలు పెట్టింది.

భర్త మృతి.. డిప్రెషన్‌లోకి: నటిగా సినిమాల్లోకి అడుగు పెట్టిన తర్వాత సురేఖ వాణి వరుసగా ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసి.. ఎనలేని క్రేజ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఇలా సాగిపోతోన్న సమయంలోనే ఆమె భర్త సురేష్ తేజ ఆకస్మికంగా మృతి చెందారు. ఈ దుర్ఘటన తర్వాత ఆమె చాలా రోజుల పాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. కానీ, కూతురు సుప్రిత చొరవతో త్వరగానే కోలుకుంది.

ఆమెతో రచ్చ... మళ్లీ పెళ్లి: సురేఖ వాణి గతంలో మాదిరిగా వరుసగా సినిమాలు చేయకున్నా.. ఈ మధ్య తన వ్యవహార శైలితో హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా కూతురితో కలిసి ట్రిప్పులకు వెళ్లడం, డ్యాన్స్ వీడియోలు చేయడం, హాట్ షోతో రెచ్చిపోవడం వంటివి చేస్తోంది. ఇవి మాత్రమే కాకుండా సురేఖ రెండో పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు బయటకు రావడంతో ఆమె పేరు సెన్సేషన్‌గానూ మారింది.

అందులో యమ యాక్టివ్: ఒకప్పుడు చాలా వేగంగా సినిమాలు చేసి.. ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయిన సురేఖ వాణి.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లోనే హడావిడి చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. తద్వారా తన క్రేజ్‌ను కూడా రెట్టింపు చేసుకుంటూ వెళ్తోంది.
కూతురి కలిసే ఆరబోత: సోషల్ మీడియాలో సురేఖ వాణి ఏ రేంజ్‌లో హడావిడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈ సీనియర్ నటి తరచూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు క్రమం తప్పుకుండా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అదే సమయంలో తన కూతురితో కలిసి షార్ట్ డ్రెస్‌లు వేస్తూ ఓ రేంజ్‌లో హాట్ షో కూడా చేస్తూ రచ్చ చేస్తోంది.

కూతురి కలిసి డ్యాన్సు: సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే సురేఖ వాణి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె తన కూతురు సుప్రితతో కలిసి 'రూల్స్ రంజన్' సినిమాలోని 'సమ్మోహనుడా' అంటూ సాగే పాటకు అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ చేసింది. ముఖ్యంగా వీళ్లిద్దరి స్టెప్పులు సింక్‌లో పడగా.. ఎక్స్‌ప్రెషన్స్‌తో కూడా అదరగొట్టేశారు.
అందాల ఆరబోత కూడా: తాజాగా సురేఖ వాణి షేర్ చేసిన డ్యాన్స్ వీడియోలో గ్లామర్ టచ్ కూడా ఉంది. ఇందులో తల్లీ కూతుళ్లు ఇద్దరూ ట్రాన్స్‌పరెంట్ శారీ కట్టుకుని అందాలను ఆరబోశారు. ఇంకేముంది.. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా సురేఖ, సుప్రిత డ్యాన్స్ వీడియోకు లక్షల్లో లైకులు వస్తున్నాయి. మొత్తానికి ఇది విపరీతంగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











