Surekha Vani: మంగళసూత్రంతో సురేఖ వాణి.. మళ్లీ పెళ్లి అంటూ.. మరీ ఇంత నీచంగానా!
సాధారణంగా సినీ రంగంలోని స్టార్లకే కాదు.. కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులకు సైతం విశేషమైన ఫాలోయింగ్ లభిస్తుంటుంది. తెలుగులోనూ అలా చాలా మందే పాపులర్ అయ్యారు. అందులో ప్రముఖ నటి సురేఖ వాణి ఒకరు. సుదీర్ఘ కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన పాత్రలతో మెప్పిస్తోన్న ఈమె.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ తన రేంజ్‌ను పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా సురేఖ వాణి వదిలిన ఒక ఫొటో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూడండి!
యాంకరింగ్ టూ మూవీస్:నటిగా పరిచయం అవడానికి ముందే సురేఖ వాణి యాంకర్‌గా సత్తా చాటింది. అప్పట్లోనే ప్రముఖ ఫిల్మ్ మేకర్ సురేష్ తేజను ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతడితోనే కలిసి సురేఖ 'మా టాకీస్', 'హార్ట్ బీట్', 'మొగుడ్స్ పెళ్లామ్స్' అనే షోలను చేసింది. ఈ క్రమంలోనే 'శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్' అనే మూవీతో ఈమె నటిగా కెరీర్‌ను మొదలు పెట్టేసింది.

భర్త మరణం.. గ్యాపిచ్చినా:భర్త సపోర్టుతో సినిమాల్లో సత్తా చాటుతోన్న సురేఖ వాణి.. కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్లింది. ఆ సమయంలోనే సురేష్ తేజ ఆకస్మికంగా మృతి చెందారు. ఈ దుర్ఘటన తర్వాత ఆమె చాలా రోజుల పాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. కానీ, కూతురు సుప్రిత చొరవతో త్వరగానే కోలుకుంది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా ఆఫర్లను అందుకుంటోంది.
డాటర్‌తో ఫుల్ ఎంజాయ్:గతంలో మాదిరిగా సురేఖ వాణి ఏకధాటిగా సినిమాలు చేయకున్నా.. ఈ మధ్య తన వ్యవహార శైలితో హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా కూతురితో కలిసి ట్రిప్పులకు వెళ్లడం, డ్యాన్స్ వీడియోలు చేయడం, హాట్ షోతో రెచ్చిపోవడం వంటి వాటితో హైలైట్ అవుతోంది. ఇవి మాత్రమే కాకుండా సురేఖ రెండో పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు బయటకు రావడంతో వార్తల్లోనూ నిలిచింది.

అందులో యమ యాక్టివ్:చాలా కాలం పాటు ఎంతో వేగంగా సినిమాలు చేసి.. ఈ మధ్య కాలంలో కాస్త నెమ్మదించిన సురేఖ వాణి.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లోనే హడావిడి చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. తద్వారా ఫాలోవర్లను ఖుషీ చేసేస్తోంది.
అప్పుడప్పుడూ వాటితో:సురేఖ వాణి సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో హల్చల్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈ సీనియర్ నటి తరచూ అందాలను ప్రదర్శిస్తూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అదే సమయంలో కూతురు సుప్రితతో కలిసి షార్ట్ డ్రెస్‌లు వేస్తూ ఓ రేంజ్‌లో హాట్ షో చేస్తూ సెన్సేషన్‌గా మారుతోంది.

మంగళసూత్రంతో ఫోజ్:సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే సురేఖ వాణి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో చీరకట్టులో డీసెంట్‌గానే దర్శనమిచ్చిన ఈ సీనియర్ నటి.. మెడలో మంగళసూత్రంతో కనిపించింది. దీంతో అందరూ ఆమె మెడలో తాళిబొట్టు గురించే ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తానికి సురేఖ వాణి షేర్ చేసిన ఈ ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది.
నీచంగా మాట్లాడుతూ:సురేఖ వాణి షేర్ చేసిన ఫొటోలో ఆమె మంగళసూత్రంతో కనిపించడం హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై చాలా మంది నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం 'నీకు మళ్లీ పెళ్లైందా' అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే నీచమైన పదజాలంతో కామెంట్లు రాస్తున్నారు. మొత్తానికి సురేఖ వాణి షేర్ చేసిన ఫొటో సంచలనంగా మారిపోయింది.


Click it and Unblock the Notifications











