twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    23 ఏళ్ల తర్వాత అదే.. అల్లు అర్జున్‌ కామెంట్స్.. షారుక్ ఖాన్ దిమ్మతిరిగే రియాక్షన్!

    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రశంసలు గుప్పించడం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. తాను నటించిన జీరో సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన షారుక్ ఓ ప్రశ్నకు సమాధానంగా అల్లు అర్జున్ గురించి కామెంట్ చేశారు. ఈ ఘటనకు ముందు ఇన్స్‌టాగ్రామ్‌లో షారుక్ నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే చిత్రం గురించి అల్లు అర్జున్ సెన్సేషనల్ కామెంట్స్ చేయడం అందుకు కారణంగా మారింది. అల్లు అర్జున్ ఏమన్నారంటే..

     23 ఏళ్ల క్రితం డిడీఎల్‌జే

    23 ఏళ్ల క్రితం డిడీఎల్‌జే

    నేను మళ్లీ దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే చూశాను. గతంలో 23 ఏళ్ల క్రితం ఆ సినిమాను చూశాను. ఆ సినిమాలో తుజే దేఖాతో యే జానా సనమ్ పాట ఓ జీవితంలో ఓ మ్యాజిక్ చేసింది అని అల్జు అర్జున్ ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

    మళ్లీ అదే మ్యాజిక్

    మళ్లీ అదే మ్యాజిక్

    1995లో అంటే దాదాపు 23 ఏళ్ల క్రితం ఆ చిత్రాన్ని చూశాను. ఆ తర్వాత ఈ వారాంతంలో మళ్లీ ఆ సినిమాను చూశాను. అప్పుడు ఎలాంటి మ్యాజిక్ అనిపించిందో.. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ నా హృదయంలో రేకెత్తింది అంటూ అల్జు అర్జున్ తెలిపారు.

    <strong>బన్నీ ఫాన్స్‌కు పండగే.. న్యూ ఇయర్ నైట్ త్రివిక్రమ్ అదిరిపోయే గిఫ్ట్!</strong>బన్నీ ఫాన్స్‌కు పండగే.. న్యూ ఇయర్ నైట్ త్రివిక్రమ్ అదిరిపోయే గిఫ్ట్!

     అల్లు అర్జున్ ఐ లవ్ యూ

    అల్లు అర్జున్ ఐ లవ్ యూ

    అల్లు అర్జున్ చేసిన కామెంట్‌ను షారుక్ ఖాన్ వద్ద ప్రస్తావించగా.. అల్లు అర్జున్ ఐ లవ్ యూ. ఏదో ఒకరోజు వందశాతం నీతో గడపడానికి నేను వస్తాను. నీవు అద్భుతమైన వ్యక్తివి. అమోఘమైన ప్రతిభ కలిగిన నటుడివి అని షారుఖ్ అన్నారు.

    స్టైలిష్ స్టార్‌పై టైగర్ ష్రాఫ్ ఫిదా

    స్టైలిష్ స్టార్‌పై టైగర్ ష్రాఫ్ ఫిదా

    అల్లు అర్జున్‌ను బాలీవుడ్ హీరోలు ప్రశంసించడం కొత్తేమీ కాదు. ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన టైగర్ ష్రాఫ్ కూడా స్టైలిష్ స్టార్ డ్యాన్సులకు ఫిదా అయ్యాడు. అల్లు అర్జున్ గురించి స్టైలిష్ స్టార్ మాట్లాడుతూ.. మెరుపు తీగలా చేసే డ్యాన్సులు అంటే నాకు చాలా ఇష్టం. అల్లు అర్జున్ నాకు ఫేవరేట్ యాక్టర్. అతను అన్నా.. ఆయన నటన అన్నా నాకు చెప్పలేనంత ఇష్టం. అని అన్నారు.

    సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో

    సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో

    ఇదిలా ఉండగా, షారుక్ ఖాన్ నటించిన జీరో మూవీ డిసెంబర్ 21న రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో కత్రినా కైఫ్, అనుష్క శర్మ జంటగా నటించారు. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ కూడా అతిథి పాత్రలో కనిపిస్తారు.

    English summary
    Bollywood superstar Shah Rukh Khan (SRK) was recently seen going gaga over stylish star Allu Arjun. The video featuring Zero star's comment on Bunny is trending on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X