Shah Rukh Khan బాహుబలిని తుక్కు తుక్కుగా కొట్టిన జవాన్.. అలా హింట్ ఇచ్చిన షారుక్, అట్లీ!
ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో బాహుబలి2 సాధించిన రికార్డులు ఎవరికి అందని ద్రాక్షల మారాయి. అయితే సినిమా కలెక్షన్ల విషయం మాట్లాడాల్సి వస్తే.. నాన్ బాహుబలి రికార్డులు అంటూ మిగితా సినిమాల నిర్మాతలు చెప్పుకొంటారు. అంతగా బాక్సాఫీస్‌పై బాహుబలి2 మూవీ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అతిపెద్ద ఇండస్ట్రీగా భావించే బాలీవుడ్ సినిమాలు కూడా బాహుబలి2 కలెక్షన్లను అధిగమించడానికి తంటాలు పడుతుంటాయి. అయితే షారుక్ ఖాన్ నటించిన పఠాన్ కొంత బాహుబలిని చేరుకొనేందుకు ప్రయత్నించింది. కానీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే ఏ సినిమానైనా బాహుబలిని చేరుకొంటుందా? అనే చర్చ జరుగుతున్న సమయంలో జవాన్ మూవీ క్లైమాక్స్‌లో బాహుబలిని తుక్కు తుక్కుగా కొట్టినట్టు షారుక్, అట్లీ కలిసి ఓ సీన్ క్రియేట్ చేశారు. ఆ సీన్ వివరాల్లోకి వెళితే..
జవాన్ సినిమా పక్కా మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో దేశంలో రాజకీయ నేతలు, మంత్రులు చేసే జరిగే అక్రమాలు, ఆరోగ్య రంగంలో అవినీతి తదితర అంశాలతో చర్చించారు. అంతేకాకుండా దేశం కోసం పోరాడే ఓ జవాన్.. నాసిరకమైన తుపాకులను సైన్యానికి ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో అనే విషయాన్ని టచ్ చేశారు. అంతేకాకుండా జైలర్‌గా పనిచేసే ఓ వ్యక్తి తనకంటూ ఓ ప్రైవేట్ సైన్యాన్ని క్రియేట్ చేసుకొని రాజకీయ నేతలు మంత్రులను కిడ్నాప్, హైజాక్ చేస్తూ సంచలనంగా మారుతాడు.

మాస్, కమర్షియల్ సినిమాకు కావాల్సిన ఎమోషన్స్, థ్రిల్స్ అన్నీ కలబోసి జవాన్ సినిమాను షారుక్ ఖాన్‌తో అట్లీ తెరకెక్కించారు. ట్రైలర్, టీజర్లకు భారీ రెస్సాన్స్ రావడంతో అంతే మొత్తంలో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు నమోదు అయ్యాయి. అయితే ఈ సారి మాత్రం పఠాన్ రికార్డులను జవాన్ తిరిగి రావయం ఖాయమనే మాటను ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
ఇదిలా ఉండగా, జవాన్ అడ్వాన్స్ బుకింగ్ చూస్తే.. బాహుబలి రికార్డులకు చేరువ అవుతుంది. కానీ బీట్ చేయడం కష్టమనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. అయితే ఈ సినిమా బాహుబలి2 రికార్డులపై గురిపెట్టినట్టు బాక్సాఫీస్ జోష్ చూస్తే స్పష్టమవుతుంది. షారుక్, అట్లీకి కూడా మనసులో బాహుబలి2 కలెక్షన్లను దాటేయాలనే ఆశ మనసులో ఉందనేది సినిమాలో ఓ సన్నివేశాన్ని క్రియేట్ చేసి చూపించారు.

జవాన్ సినిమా క్లైమాక్స్ సీన్‌లో మూవీ అంతా అయిపోయిందని అనిపిస్తుంది. విజయ్ సేతుపతికి తండ్రి కొడుకులుగా నటించిన షారుక్ ఖాన్ ఇద్దరు గుణపాఠం నేర్పి.. రివేంజ్ తీర్చుకొంటారు. ఇక మిషన్ ముగిసిందని ప్రేక్షకులు భావిస్తారు. అంతలోనే అంతలోనే 6, 7 ఫీట్లు, ఆజానుబహుడైన ఓ మహాబలుడు ఇద్దరి ముందు కనిపిస్తాడు. దాంతో బాహుబలి అంటూ అతడిని కొట్టడానికి ఇద్దరు షారుక్ ఖాన్లు ప్రయత్నిస్తే..వారిని బాహుబలి తుక్కు తుక్కుగా కొడుతాడు.
అయితే దెబ్బల నుంచి తేరుకొని తండ్రి కొడుకులు కలిసి చివరకు బాహుబలి ఆటకట్టిస్తారు. సినిమా అయిపోయిన తర్వాత ఈ సీన్ పెట్టడం వెనుక కారణం.. బాహుబలి రికార్డు కొట్టబోతున్నామనే మాటను చెప్పడానికే అని అభిమానులు చెప్పుకొంటున్నారు. ఆ సీన్ ద్వారా షారుక్ తన ఫ్యాన్స్‌కు, సినీ వర్గాలకు హింట్ ఇచ్చి ఉంటారనే టాక్ ప్రస్తుతం వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











