2023లో 3 సినిమాలతో 2500 కోట్ల కలెక్షన్లు.. వరుస డిజాస్టర్స్‌ నుంచి గట్టెక్కిన సూపర్ స్టార్ ఎవరంటే?

సినిమా పరిశ్రమలో ఎంతటి సూపర్ స్టార్‌కైనా ఓ గడ్డుకాలం ఉంటుంది. వరుస విజయాలను అందించిన హీరోలు వరుస డిజాస్టర్లతో బెంబేలవుతారు. పరాజయాల నుంచి తేరుకొని మళ్లీ స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకొనే హీరోలు అతి కొద్ది మందే ఉంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ముందు వరుసలో ఉంటారు. ఆయన జీవితంలో ఎదురైన గడ్డు పరిస్థితులను అధిగమించి 2023 జైత్రయాత్రను కొనసాగించారు. 2023 సంవత్సరంలో షారుక్ ఖాన్ సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఇండస్ట్రీ హిట్స్‌తో దూసుకెళ్తున్న షారుక్ ఖాన్‌కు 2015 సంవత్సరంలో ఫ్యాన్ మూవీ భారీ బ్రేక్ వేసింది. ఆ తర్వాత డియర్ జిందగీ, రాయిస్, జబ్ హ్యారీ మెట్ సెజల్, జీరో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే వరుస డిజాస్టర్లతో షారుక్ కంగారుపడిపోయాడు. భారీ హిట్ కోసం ప్రయత్నిస్తూ.. పఠాన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Shah Rukh Khan scored 2500 crores with Pathaan, Jawan, Dunki in 20223 after serial Disasters in Career,

2023 సంవత్సరంలో షారుక్ ఖాన్ జనవరి 25 తేదీన పఠాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో శుభారంభం పలికింది. పఠాన్ చిత్రం షారుక్ ఖాన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 1050 కోట్ల వసూళ్లను సాధించింది.

పఠాన్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత 2023 సంవత్సరంలోనే షారుక్ మళ్లీ సెప్టెంబర్ 7వ తేదీన జవాన్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. ఈ సినిమా కూడా తొలి ఆట నుంచే భారీ విజయాన్ని అందుకొన్నది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1159 కోట్లు, ఇండియాలో 754 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

 Shah Rukh Khan scored 2500 crores with Pathaan, Jawan, Dunki in 20223 after serial Disasters in Career,

పఠాన్, జవాన్ సినిమాల ఘన విజయం తర్వాత షారుక్ ఖాన్ ఒకే క్యాలెండర్ ఇయర్‌లో మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డిసెంబర్ 21వ తేదీన రిలీజైన ఈ సినిమా కూడా భారీ ఓపెనింగ్స్ సాధిస్తున్నది. ఈ సినిమా ప్రస్తుతానికి 300 కోట్ల కలెక్షన్లకు చేరువయ్యారు. ఓవర్సీస్‌లో 104 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

 Shah Rukh Khan scored 2500 crores with Pathaan, Jawan, Dunki in 20223 after serial Disasters in Career,

గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా షారుక్ ఖాన్ డిజాస్టర్లను, అలాగే బ్లాక్ బస్టర్లను చూశాడు. వరుసగా సినిమాల బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో అభిమానులు కంగారుపడిపోయారు. 2023లో హ్యాట్రిక్ విజయాలు అందుకొని మళ్లీ తన స్టార్ స్టామినాను నిలబెట్టుకొన్నాడు. ఇక ముందు కూడా ఇలాంటి విజయాలే సాధిస్తారని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X